Ads
బాలయ్య, గోపీచంద్ మలినేని దర్శకత్వం లో వస్తున్న తదుపరి చిత్రం ‘వీర సింహా రెడ్డి’. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. అయితే ఈ సినిమాలో గోపీచంద్ మార్క్ కాకుండా.. బాలయ్యతో హ్యాట్రిక్ హిట్స్ తీసిన బోయపాటి మార్క్ కనిపిస్తుందని చర్చించుకుంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.
Video Advertisement
దానికి కారణం సినిమా ఓపెనింగ్ నుండి ఇప్పటివరకు అన్నింటా బోయపాటి మార్క్ కనిపిస్తుండటమే. సినిమా వర్కింగ్ టైటిల్ అనౌన్స్ నుండి సినిమా షూటింగ్ వరకు, ఇప్పుడు ప్రచారాలు, రిలీజ్‌ల స్టయిల్ వరకు చాలావరకు బోయపాటి మార్క్ కనిపిస్తుండటమే. అంతే కాకుండా ఇక సినిమా ప్లాట్, ఇద్దరు బాలయ్యల బ్యాగ్రౌండ్ కూడా సేమ్ టు సేమ్ లా ఉంది అని చర్చలు మొదలయ్యాయి.
‘అఖండ’ సినిమాకు చాలా రోజులపాటు సినిమా రిలీజ్ ముందు వరకు పేరు పెట్టలేదు. చాలా పేర్లు వినిపించి, వినిపించి ఆఖరికి ‘అఖండ’ ఫిక్స్ చేశారు. ఇప్పుడు ఎన్బీకే 107 విషయంలోనూ అదే జరిగింది అని చెప్పాలి.
అంతే కాకుండా ఈ చిత్రం లో యాక్షన్ సీక్వెన్స్ లు కూడా గోపీచంద్ స్టైల్ లో కాకుండా అఖండ స్టయిల్‌లో ఉంటే బెటర్ అని అనుకున్నారట బాలయ్య. అందుకే ఆ సినిమా ఫైట్ మాస్టర్స్‌తోనే ఫైట్స్ చేయిద్దాం అని సూచించారట.
దీంతో ఈ మాత్రం దానికి మళ్లీ గోపీచంద్ మలినేనిని ఈ సినిమాకు దర్శకత్వం వహించమని అడగడం ఎందుకు…బోయపాటికే ఈ సినిమా చేయమని అడిగితే సరిపోయేది కదా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
source:https://telugu.filmyfocus.com/balayya-babu-in-think-of-boyapati-style-for-veera-simha-reddy/
End of Article