Ads
ఓ సినిమా స్క్రిప్ట్ దశలో ఉన్నపుడే కచ్చితంగా దాని మీద మేకర్స్ కి ఓ అవగాహన అయితే వచ్చేస్తుంది. దర్శక నిర్మాతలతో పాటు హీరో కూడా ఈ సినిమా వర్కవుట్ అవుతుందా కాదా అనేది అంచనా వేస్తారు. కొన్నిసార్లు సినిమా షూటింగ్ పూర్తైన తర్వాత ఔట్ పుట్ చూసుకుంటే అది ఫ్లాప్ అవుతుందని ముందే తెలిసిపోతుంది. వారికున్న అనుభవం వారికి ముందుగానే సిగ్నల్స్ ఇస్తుంది.
Video Advertisement
అలాగే మన నట సింహం బాలయ్యకి కూడా ఒక సినిమా ఫలితం ముందుగానే తెలిసినా.. తప్పక ఆ చిత్రం చేశారట. అదే ‘తిరగబడ్డ తెలుగుబిడ్డ’. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు బాలయ్య కథల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకునేవాళ్లు. దాదాపు అన్ని కథలను ఆయన విని ఓకే చేసిన తర్వాతే బాలయ్య దగ్గరకు వెళ్లేవి. అప్పుడు కోదండరామి రెడ్డి దర్శకత్వంలో అన్నగారు ఓకే చేసిన కథతో బాలయ్య హీరోగా వచ్చిన ‘అనసూయమ్మ గారి అల్లుడు’ బ్లాక్ బస్టర్ అయింది.
దీంతో ఆయనతో మరో చిత్రం చెయ్యాలి అనుకున్నారు ఎన్టీఆర్. అయితే ఆయన సెలెక్ట్ చేసుకున్న కథ దర్శకుడు కోదండరామిరెడ్డికి అస్సలు నచ్చలేదు. దాంతో అన్నగారికి కథ నచ్చలేదని.. ఇది చేస్తే ఫ్లాప్ అవుతుందని మొహం మీదే చెప్పేసాడు దర్శకుడు. మీకు నచ్చనపుడు సినిమా నేనెందుకు చేయమంటాను అంటూ ఎన్టీఆర్ కూడా సైలెంట్ అయిపోయాడు. కానీ కొన్ని రోజుల తర్వాత ఫోన్ చేసి ఎందుకో తెలియదు కానీ ఆ కథతోనే సినిమా చేయాలని అన్నారంట ఎన్టీఆర్.
ఇక తప్పదని సినిమా చేసాడు కోదండరామి రెడ్డి. బాలయ్య కి కూడా ఈ సినిమా కథ నచ్చలేదని ఓ ఇంటర్వ్యూలో కోదండరామి రెడ్డి చెప్పాడు. ఎన్టీఆర్ కి ఎదురు చెప్పలేక ఇద్దరు అయిష్టం గానే చేసారు. అందులో బాలయ్య పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించాడు. ఒక షాట్ చేస్తున్నప్పుడు. వన్ మోర్ అని చెప్పాడు దర్శకుడు. ఎందుకండీ వన్ మోర్. ఎలాగూ ప్లాప్ అయ్యే సినిమానే కదా అన్నాడట బాలయ్య.
అనుకున్నట్లుగానే సినిమా విడుదల అయ్యింది. పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ చిత్రం లో భానుప్రియ హీరోయిన్‌గా నటించింది. జీవిత చెల్లెలు పాత్రలో నటించింది. అయితే ఈ సినిమాలోనే బాలయ్య మొదటిసారి బ్రేక్ డాన్స్ చేసాడు.
End of Article