ఇటీవలే అఖండ చిత్రంతో భారీ సక్సెస్ సాధించారు బాలకృష్ణ. బాలకృష్ణ నటించిన ప్రాజెక్టుగా ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సారథ్యంలో, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం NBK 107. ఇది బాలకృష్ణ 107 వ చిత్రంగా రూపుదిద్దుకుంటుంది.

Video Advertisement

ఇదిలా ఉంటే బాలయ్య పైసా వసూల్ సినిమా కూడా చేసారు. ఈ విషయం మనకు తెలిసిందే. ‘పైసా వసూల్’ ద్వారా మంచి ఫేమ్ ని కూడా బాలయ్య పొందారు.

ఈ సినిమా టైటిల్ సాంగ్ కూడా బాగా ఫేమస్ అయ్యింది. ”వసూల్ వసూల్ వసూల్ వసూల్ పైసా వసూల్ అంటూ” స్టెప్పులతో ఇరగతీసాడు బాలయ్య. పైసా వసూల్ పాట లో కైరా దత్‌ కూడా చిందులేసింది. పూరి జగన్నాథ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. శ్రియ శరణ్ బాలయ్య సరసన నటించారు. అనుప్ రూబెన్స్ పాటలని అందించారు. కానీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని పొంద లేక పోయింది.

కానీ ఈ పాట ఇక్కడ తెలుగు రాష్ట్రాల నుండి టెక్సాస్‌ లోని లమర్ యూనివర్సిటీ వరకు చేరింది. ఆ యూనివర్సిటీ లో చదువుతున్న కొందరు తెలుగు విద్యార్థులు అక్కడ ప్రొఫెసర్ కి పాటలని పరిచయం చేయగా ఆయనకి పైసా వసూల్ పాట నచ్చేయడంతో… ఆ పాట లిరిక్స్ నేర్చుకుని క్లాస్ రూము లో విద్యార్థుల ముందు పడ్డారట. ఈ వీడియో సోషల్ మీడియాలో తాజాగా వైరల్‌ అయ్యింది. టెక్సాస్ వరకూ బాలయ్య పాట చేరిందని అభిమానులు సంతోషిస్తున్నారు.

balayya- gopichnad movie have same plot like his akhanda..

ఇదిలా ఉంటే అంతా NBK 108 సినిమా వివరాలను చూస్తే… ఈ చిత్రంలో శాండిల్ వుడ్ హీరో దునియా ఫేమ్ విజయ్ విలన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల అయ్యిపోయింది. అలానే బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా టీజర్ ని కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో యాక్షన్ ఉంటుందిట. ఎమోషన్స్ కూడా ఎక్కువ వుంటాయని టాక్. అలానే సిస్టర్ సెంటిమెంట్ కూడా ఉండనుంది. వర లక్ష్మి శరత్ కుమార్ బాలయ్య సోదరిగా నటించనుంది.