• చిత్రం : బంగార్రాజు
  • నటీనటులు : నాగార్జున, నాగ చైతన్య, రమ్య కృష్ణన్, క్రితి శెట్టి.
  • నిర్మాత : అక్కినేని నాగార్జున
  • దర్శకత్వం : కళ్యాణ్ కృష్ణ
  • సంగీతం : అనూప్ రూబెన్స్
  • విడుదల తేదీ : జనవరి 14, 2022.

స్టోరీ :

Video Advertisement

సోగ్గాడే చిన్ని నాయన సినిమా ముగిసిన చోటే బంగార్రాజు కథ మొదలవుతుంది. చనిపోయిన బంగార్రాజు (నాగార్జున అక్కినేని), సత్య (రమ్య కృష్ణన్) తమ మనవడు చిన బంగార్రాజు (నాగ చైతన్య)ని చూడాలి అనుకుంటారు. చిన బంగార్రాజు చదువు అయిపోయాక ఊరికి తిరిగి వస్తాడు. మరొక పక్క నాగలక్ష్మి (క్రితి శెట్టి) ఆ ఊరి సర్పంచ్ అవుదామని అనుకుంటూ ఉంటుంది. తన మనవడి ప్రేమకి సహాయం చేయడానికి సత్య, బంగార్రాజుని భూమ్మీదకి పంపిస్తుంది. బంగార్రాజు, చిన బంగార్రాజు శరీరంలోకి దూరతాడు. చిన బంగార్రాజుకి కొన్ని సమస్యలు మొదలవుతాయి. ఆ సమస్యల నుండి చిన బంగార్రాజు ఎలా బయటపడ్డాడు? బంగార్రాజు ఎలా సహాయం చేశాడు? అసలు చిన బంగార్రాజు తల్లిదండ్రులు ఏమయ్యారు? చిన బంగార్రాజు, నాగలక్ష్మి కథ ఏమైంది? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

bangarraju movie review

రివ్యూ :

ఈ సంక్రాంతికి చాలా పెద్ద సినిమాలు విడుదలకి సిద్ధమయ్యాయి. కానీ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అన్ని సినిమాలు వెనకడుగు వేశాయి. బంగార్రాజు మాత్రం మొదటి నుండి సంక్రాంతి బరిలోనే ఉంది. ఏ సినిమా విడుదల అయినా కాకపోయినా మా సినిమా మాత్రం కచ్చితంగా సంక్రాంతికే విడుదల అవుతుంది అని సినిమా బృందం చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు. చెప్పినట్టుగానే సినిమా సంక్రాంతి కానుకగా విడుదల అయ్యింది. కథాపరంగా చూస్తే సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకి, బంగార్రాజు సినిమాకి పెద్ద తేడా కనిపించదు. స్టోరీ లైన్ దాదాపు అలాగే ఉంది. కానీ హీరో హీరోయిన్లని మార్చడం వల్ల కొంచెం కొత్తగా అనిపించింది. పర్ఫామెన్స్ విషయానికి వస్తే, నాగార్జున బంగార్రాజు పాత్రలో బాగా చేశారు. ముందు సినిమాలతో పోలిస్తే నాగ చైతన్య కూడా ఈ సినిమాలో కొంచెం యాక్టివ్ గా చేశారు.

bangarraju movie review

రమ్య కృష్ణన్ స్క్రీన్ ప్రెజెన్స్ ఈ సినిమాకి ఒక ప్లస్ పాయింట్. అలాగే క్రితి శెట్టి పాత్ర కూడా ముందు రెండు సినిమాల కంటే ఈ సినిమాలో డిఫరెంట్ గా ఉంది. సహాయ పాత్రల్లో నటించిన వెన్నెల కిషోర్, ప్రవీణ్, రావు రమేష్, బ్రహ్మాజీ మిగిలిన అందరూ పాత్ర మేరకు బానే నటించారు. అనూప్ రూబెన్స్ అందించిన పాటలు బాగున్నాయి. రెండు, మూడు పాటలు పిక్చరైజేషన్ కూడా బాగుంది. సినిమా అంతా చాలా కలర్ ఫుల్ గా ఉంటుంది. కానీ స్టోరీ మాత్రం పెద్దగా ఉన్నట్టు అనిపించదు. నెక్స్ట్ ఏమవుతుందో మనకు అర్థమవుతూ ఉంటుంది. కానీ ఈ సారి సంక్రాంతికి విడుదలైన పెద్ద సినిమా ఇదొక్కటే కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి.

bangarraju movie review

ప్లస్ పాయింట్స్ :

  • ఊరి నేటివిటీని చూపించిన విధానం
  • పాటలు
  • నాగార్జున

మైనస్ పాయింట్స్:

  • పాత స్టోరీ లైన్
  • ఇంకా బాగా తీయచ్చు అనుకునే చాలా సీన్స్

రేటింగ్ :

2.5/5

ట్యాగ్ లైన్ :

పండగకి ఏదైనా సరదాగా ఒక సినిమా చూద్దాం అనుకున్న వాళ్ళని బంగార్రాజు నిరాశపరచదు. కానీ, కథలో కొత్తదనం లేకపోవడం వల్ల బంగార్రాజు ఒక అబవ్ యావరేజ్ టైంపాస్ ఎంటర్టైనర్ గా నిలుస్తుంది.