Home Sports Adda అంపైర్ అవుట్ ఇవ్వలేదని…బాంగ్లాదేశ్ క్రికెటర్ “షకీబ్” ఏం చేసాడో చూడండి.! (వైరల్ వీడియో)

అంపైర్ అవుట్ ఇవ్వలేదని…బాంగ్లాదేశ్ క్రికెటర్ “షకీబ్” ఏం చేసాడో చూడండి.! (వైరల్ వీడియో)

by Mohana Priya

బంగ్లాదేశ్ స్టార్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ వివాదంలో ఇరుక్కున్నారు. ఆయన చర్యకి నెటిజన్లు తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంపైర్ అవుట్ ఇవ్వలేదు అనే కోపంతో స్ట్రైకర్ ఎండ్ లోని వికెట్లని తన్నారు షకీబ్ అల్ హసన్. అంతే కాకుండా అంపైర్ ని తిడుతూ ఆయన మీదకి వెళ్ళారు.

Shakib Al Hasan angry behavior video going viral

ధాకా ప్రీమియర్ డివిజన్ టి20 క్రికెట్ లీగ్ లో భాగంగా అబహాని లిమిటెడ్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో మహమ్మెదన్ స్పోర్ట్స్ క్లబ్ జట్టుకి సారథ్యం వహిస్తున్నారు షకీబ్ అల్ హసన్. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన షకీబ్ అల్ హసన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 145 పరుగులు చేసింది.

Shakib Al Hasan angry behavior video going viral

తర్వాత అబహాని లిమిటెడ్ టీం బ్యాటింగ్ కి దిగగా షకీబ్ అల్ హసన్ అయిదవ ఓవర్ వేశారు. ఈ ఓవర్ లో ముష్ఫికర్ 6,4 స్కోర్ చేశారు. తర్వాతి బంతి అతని బ్యాట్ మిస్సై ప్యాడ్ లను తాకింది. ఎల్బీ కోసం అప్పీల్ చేసిన షకీబ్ అల్ హసన్ అంపైర్ నాట్ అవుట్ ఇవ్వడంతో సహనాన్ని కోల్పోయారు.

 

కోపంతో అతనిపైకి దూసుకెళుతూ నాన్ స్ట్రైకర్ ఎండ్ లోని వికెట్లను పడగొట్టారు. తర్వాత మరొకసారి అంపైర్ నిర్ణయం పట్ల అసహనానికి గురయ్యి ఫీల్డింగ్ చేస్తున్న షకీబ్ అల్ హసన్ నాన్ స్ట్రైకర్ వికెట్లను పీకి పారేసారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎంతో మంది యువ క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలవాల్సిన ఒక ప్లేయర్ ఇలా చేయడం సరికాదు అని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

watch video :

You may also like