పది రోజులే ఉందంటూన్న బర్రెలక్క…. వీడియో వైరల్

పది రోజులే ఉందంటూన్న బర్రెలక్క…. వీడియో వైరల్

by Mounika Singaluri

Ads

సోషల్ మీడియా ఎవ్వరిని, ఎప్పుడు, ఎందుకు ఫేమస్ చేస్తుందో తెలియదు. కొంతమంది వందల వందల వీడియోలు చేస్తూ ఉంటారు కానీ ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ ఒక్కొక్కరు ఒక్క వీడియోతో మొత్తం వైరల్ అయిపోతారు. అల వైరల్ అయిన వ్యక్తి బర్రెలక్క.

Video Advertisement

కరోనా  సమయంలో శిరీష అనే యువతి తన సోషల్ మీడియా ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేసింది. బీటెక్ చదివిన కూడా ఏమీ లాభం లేదు ఫ్రెండ్స్, బర్రెలను కాస్తున్న అంటూ గేదలను మేపుతున్న వీడియోను పోస్ట్ చేసింది. అది కాస్త వైరల్ అయ్యి కూర్చుంది.

barrelakka

అయితే ఇప్పుడు బర్రె లక్క అనుహ్యంగా తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తుంది. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో దిగింది. ఇటీవల బర్రె లక్క నామినేషన్ కూడ సమర్పించింది. అయితే ఈ ఎన్నికల ప్రచారం మాత్రం తనకి గుర్తింపు ఇచ్చిన సోషల్ మీడియాలోనే చేస్తుంది.ఇటీవల తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియో పోస్ట్ చేసింది.నేను మీ శిరీష అలియాస్ బర్రె లక్క…నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగాపోటీ చేస్తున్న … నాకు సపోర్ట్ చేస్తున్న వారందరికీ ధన్యవాదాలు. నేను ఇంటింటికి తిరిగి ప్రచారం చేయలేను.

ఈ వీడియోను షేర్ చేయండి. అందరికీ పాదాభివందనాలు. మీడియా వారు,సోషల్ మీడియా వారు నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఈ వీడియోకు భారీగా లైక్స్, వ్యూస్ రావడంతో మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఏది ఏమైనా ఈ వీడియో చూస్తుంటే తెలంగాణలో ఎన్నికల వేడి ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతుంది. ప్రధాన పార్టీలన్నీ నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నాయి. ఇలా సామాన్య ప్రజలు కూడా ముందుకు వచ్చి ఇండిపెండెంట్ గా నిలబడటం శుభసూచకమే.

https://www.instagram.com/reel/Czc1SxRJRGN/

 

Also Read:జనసేన పార్టీకి కొత్త చిక్కు వచ్చి పడిందిగా..? కూకట్ పల్లిలో సీటు ఫైనల్ అయ్యింది కానీ ఆ గుర్తు వల్ల.?

 


End of Article

You may also like