తెలంగాణ ఎన్నికల బరిలో జనసేన పార్టీ ఉంది. బిజెపితో పొత్తు పెట్టుకుని జనసేన ఎనిమిది స్థానాలలో పోటీ చేస్తుంది.అయితే అన్నిటి కంటే జనసేన పోటీ చేస్తున్న కూకట్ పల్లి నియోజకవర్గం పైన అందరి దృష్టి ఉంది. ఎందుకంటే కుకట్ పల్లి ప్రాంతంలో ఆంధ్ర నుండి వచ్చిన సెటిలర్లు ఎక్కువమంది ఉన్నారు. వారందరూ ఎక్కువ శాతం జనసేన వైపు మొగ్గు చూపుతారని అనుకుంటున్నారు.

Video Advertisement

ఇక్కడ జనసేన అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ కూడా ప్రచారం జోరుగా చేస్తున్నారు. అయితే కూకట్ పల్లి నియోజకవర్గంలో జనసేనకి ఇప్పుడు కొత్త చిక్కు వచ్చి పడింది.జనసేన పార్టీ అభ్యర్థి నిలబడ్డ కూకట్ పల్లి నియోజకవర్గంలో మరో పార్టీ వచ్చి నిలబడింది. ఇప్పటికే అక్కడ బి.ఆర్.ఎస్, కాంగ్రెస్ జనసేన పోటా పోటీగా ఉన్నాయి.

అయితే ఈ నియోజకవర్గంలో జాతీయ జనసేన పార్టీ తమ అభ్యర్ధిని నిలబెట్టింది. జాతీయ జనసేన పార్టీ పేరు జనసేన పార్టీకి దగ్గరగా ఉంది. జనసేన పార్టీకి నష్టం కలిగించేందుకు ఈ పార్టీ తెరమీదకు వచ్చిందని రాజకీయ నాయకులు అంటున్నారు. అయితే ఈ పార్టీకి కేటాయించని ఎన్నికల గుర్తు కూడా గాజు గ్లాసును పోలి ఉండడం జనసేనకు మరింత నష్టం చేస్తుంది అని అంటున్నారు. జాతీయ జనసేన పార్టీకి ఎన్నికలు కమిషన్ బకెట్ గుర్తును కేటాయించింది. గాజు గ్లాసు, బకెట్ రెండు కూడా ఇంచుమించు ఒకేలా ఉంటాయి.దీంతో కూకట్ పల్లిలో జనసేనకి పడే ఓట్లు చీలే అవకాశం ఉందని జనసేన అభ్యర్థి ప్రేమ్ కుమార్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లారు.

janasena

ఎందుకంటే గత 2018 ఎన్నికల్లో BRS పార్టీకి ఇలా రోడ్డు రోలర్ గుర్తు వల్ల తీవ్ర నష్టం జరిగింది. కారు గుర్తును పోలి ఉండడంతో ఆ ఓట్లన్నీ రోడ్డు రోలర్ కి పడ్డాయి. ఇప్పుడు కూకట్ పల్లిలో జనసేన గెలుస్తుందని అంచనాలు ఉన్నాయి. కొత్త పార్టీ గుర్తు వల్ల జనసేనకు కొత్త తలపోటు వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మొన్నటివరకు ఎన్నికల కమిషన్ జనసేన పార్టీకి గాజు గ్లాసులు రద్దు చేసిందని ప్రచారం జరగగా, అది అవాస్తవమని తేలింది. జనసేన అభ్యర్థులు నిలబడ్డ ప్రతిచోట వారికి గాజు గ్లాస్ గుర్తును ఎన్నికల కమిషన్ కేటాయించింది. ఇప్పుడు ఈ బకెట్ గుర్తు కూడా కొత్త చిక్కును తెచ్చి పెట్టింది. దీంతో ఓటర్ లు కన్ఫ్యూజన్ అయ్యే అవకాశం ఎంతైనా ఉంది.

 

Also Read:చంద్రబాబు నాయుడు గారి పెళ్లిపత్రిక చూసారా.? అప్పట్లో ఎంత కట్నం తీసుకున్నారో తెలుసా.?