మీరు ప్రేమించిన వ్యక్తి ఈ విధంగా ప్రవర్తిస్తున్నారా..? అయితే బ్రేకప్ చేయాల్సిందే..!

మీరు ప్రేమించిన వ్యక్తి ఈ విధంగా ప్రవర్తిస్తున్నారా..? అయితే బ్రేకప్ చేయాల్సిందే..!

by Harika

Ads

ప్రేమికుల రోజు న ప్రేమలో ఉన్నవారు, యువతీ యువకులు ఎంతో ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఒకరికి ఒకరు గిఫ్ట్లు ఇచ్చుకుంటూ కొందరు, లవ్ ప్రపోజ్ చేస్తూ మరికొందరు తమ వాలెంటైన్స్ డే ని ఎంజాయ్ చేస్తున్నారు. అంతా బానే ఉంది కానీ ప్రేమలో విఫలమైన వాళ్ళు, ప్రేమలో ఉంటూ కూడా ఒంటరితనాన్ని అనుభవించే వాళ్ళు కొంచెం బాధపడే సమయం ఇది.

Video Advertisement

అయితే కొందరు మాత్రం వారు ఉన్న రిలేషన్ లో క్లారిటీ తెలియక సతమతమవుతూ ఉంటారు. వాళ్లని భరించాలా లేక బ్రేకప్ చెప్పాలా అనే సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. మీ పార్టనర్ లో ఇలాంటి లక్షణాలను గమనించినట్లయితే అలాంటి వారికి బ్రేకప్ చెప్పటంలో ఏమాత్రం సంకోచించకండి. ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సరదాగా తీసుకోవలసిన విషయాలను సీరియస్గా తీసుకోవడం, మీ భావాలను గౌరవించకపోవడం, రోజులు తరబడి కాల్ చేయకపోయినా పట్టించుకోకపోవడం.

తను తరచుగా ఫోన్ చేయకపోవడం, నీ ఇష్టాలకు ఏమాత్రం ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం, మీరు కష్టంలో ఉన్నప్పుడు మీకు సపోర్ట్ ఇవ్వకపోవడం, నీ బంధం గురించి మీ భవిష్యత్తు గురించి ఆలోచించకపోవడం ఇలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తికి ఎంత త్వరగా బ్రేకప్ చెప్తే అంత మంచిది. అంతే కాదు తనకి టైం ఉన్నప్పుడు దానికి అవసరం అయినప్పుడు మీ తోడుని కోరుకున్న వ్యక్తిని అసలు దగ్గరికి రానీయకండి.

చిన్న విషయాలకి గొడవలు పడటం, ఫ్రెండ్స్ ముందు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడటం చేస్తున్నాడంటే అతను మీ బంధానికి విలువ ఇవ్వడం లేదని అర్థం చేసుకోండి. మీరు భవిష్యత్తులో ఎదగాలనుకున్న సమయంలో మీకు సపోర్ట్ ఇవ్వవలసింది పోయి డిస్కరేజ్ చేస్తున్నాడు అంటే మీ రిలేషన్ ప్రమాదంలో ఉందని అర్థం చేసుకోండి. ఒక రిలేషన్ శాశ్వత బంధంలోకి మారిన తర్వాత బాధపడటం కంటే ముందే ఆలోచించి నిర్ణయం తీసుకోవటం చాలా అవసరం.


End of Article

You may also like