Chatrapathi Review : “బెల్లంకొండ సాయి శ్రీనివాస్” హీరోగా నటించిన ఛత్రపతి హిట్టా..? ఫట్టా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

Chatrapathi Review : “బెల్లంకొండ సాయి శ్రీనివాస్” హీరోగా నటించిన ఛత్రపతి హిట్టా..? ఫట్టా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by Mohana Priya

Ads

ఇతర భాషల హీరోలు మరొక భాష ఇండస్ట్రీలో సినిమాలు చేయడం అనేది ఈ మధ్య సహజం అయిపోయింది. అలా మన తెలుగు హీరో అయిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా ఇప్పుడు ఛత్రపతి సినిమాతో బాలీవుడ్ లో అడుగు పెట్టారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

  • చిత్రం : ఛత్రపతి
  • నటీనటులు : బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నుష్రత్ భరుచా, శరద్ కేల్కర్.
  • నిర్మాత : ధవల్ జయంతిలాల్ గదా, అక్షయ్ జయంతిలాల్ గదా
  • దర్శకత్వం : వివి వినాయక్
  • సంగీతం : తనిష్క్ బాగ్చి
  • విడుదల తేదీ : మే 12, 2023

chatrapathi movie review

స్టోరీ :

శివ (బెల్లంకొండ సాయి శ్రీనివాస్) తన సవతి తల్లి అయిన పార్వతి (భాగ్యశ్రీ), పార్వతి సొంత కొడుకు అయిన అశోక్ (కరణ్ సింగ్ చాబ్రా) తో కలిసి ఉంటాడు. కొన్ని అనుకోని సంఘటనల వల్ల శివ తన కుటుంబంతో విడిపోయి దూరం అవుతాడు. పార్వతి శివ కోసం వెతుకుతూ ఉండగా, అశోక్ శివ చనిపోయాడు అని చెప్పిన అబద్ధం వల్ల పార్వతి బాధపడుతుంది. తర్వాత శివ ఒక బస్తీలో పెరుగుతాడు. కానీ తన తల్లి కోసం వెతుకుతూ ఉంటాడు. అక్కడే శివ భైరవ్ (ఫ్రెడ్డీ దారువాలా), అలాగే అతని అన్న భవాని (శరద్ కేల్కర్) దగ్గర పని చేస్తూ ఉంటాడు.

chatrapathi movie review

అక్కడ పని చేస్తూనే సప్న (నుష్రత్ భరుచా) సహాయంతో తన తల్లి కోసం వెతుకుతూ ఉంటాడు. అయితే అక్కడ తన బస్తీలో జరిగే దారుణాలని ఎదిరించి, అక్కడ ఉన్న రౌడీలకే అడ్డుగా నిలబడి ఆ బస్తీ వాసులని కాపాడడం వల్ల శివ ఛత్రపతి అవుతాడు. ఆ తర్వాత నుండి అక్కడ శాసించే స్థాయికి ఎదుగుతాడు. ఎంతో మందికి సహాయం చేస్తాడు. చివరికి శివ తన తల్లిని కలిసాడా? పార్వతి, అశోక్ తర్వాత ఏమయ్యారు? అశోక్ అన్న బతికున్నాడు అనే నిజం తన తల్లికి చెప్పాడా? తర్వాత శివ ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.

రివ్యూ :

ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఛత్రపతి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పటి వరకు ఉన్న ప్రభాస్ ఇమేజ్ ని మార్చేసిన సినిమా అది. ఈ సినిమాకి ఇప్పటికీ చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాంటి ఒక సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్నారు అంటే మొదటి నుండి కూడా చాలా కామెంట్స్ వస్తూ ఉన్నాయి. ఎందుకంటే హిందీలో ఈ సినిమాకి అంతకంటే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

chatrapathi movie review

హుకుమత్ కి జంగ్ పేరుతో హిందీలో ఈ సినిమా డబ్ అయ్యింది. ఇది టీవీలో వచ్చినప్పుడు ఎంతో మంది చూశారు. అలాగే యూట్యూబ్ లో కూడా ఈ సినిమాకి ఎన్నో లక్షల్లో వ్యూస్ ఉన్నాయి. ఇలాంటి సినిమాని రీమేక్ చేస్తున్నారు అంటే మామూలు విషయం కాదు. అది కూడా ప్రభాస్ ఇప్పుడు స్టార్ అయిన తర్వాత ఈ సినిమాని రీమేక్ చేశారు అంటే అది ఇంకా పెద్ద విషయం ఏమో. కానీ ఏదేమైనా సరే ఈ సినిమాని రీమేక్ చేసే డైరెక్టర్ మన వివి వినాయక్ కాబట్టి ఆ కమర్షియల్ అంశాలు అలాగే ఉంటాయి అని అనుకున్నారు.

chatrapathi movie review

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ సినిమాతో హిందీలో అడుగు పెట్టారు. ఈ విషయంపై కూడా అప్పట్లో చాలా కామెంట్స్ వచ్చాయి. ఇంక కథ విషయానికి వస్తే అసలు మార్పులు చేయలేదు. కానీ శ్రీలంక అనే ప్రాంతాన్ని మన తెలుగులో చూపించారు. దాన్ని హిందీలో ప్రాంతం మార్చి గుజరాత్ చేశారు. ఛత్రపతి సినిమా వచ్చి చాలా సంవత్సరాలు అయ్యింది. ఒక రకంగా చెప్పాలి అంటే ఈ సినిమాకి ఇప్పుడు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ సినిమా కథ వల్ల కాదు. అందులో ఉన్న ఎమోషన్స్ వల్ల, ఎలివేషన్స్ సీన్స్ వల్ల. సినిమా కథ ఎప్పుడో అవుట్ డేటెడ్ అయిపోయింది.

chatrapathi movie review

ఇలాంటి సినిమాలను హిందీలో కాదు, ఇదే కథతో తెలుగులో సినిమా వచ్చినా కూడా ఇప్పుడు చూడరు. బాలీవుడ్ సినిమా కాబట్టి ఇంకా కమర్షియల్ అంశాలు కూడా ఉన్నాయి. హీరోయిన్ ని హీరో కలిసిన తర్వాత వచ్చే పాట అసలు వినడానికి, చూడడానికి ప్రేక్షకులకు అర్థం కూడా కాదు. ఇంక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఎవరికి ఇచ్చిన పాత్రల్లో వాళ్ళు బానే చేశారు. హీరో పాత్ర పోషించిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ డాన్స్ బాగా చేశారు. కానీ కొన్ని ఎమోషనల్ సీన్స్ లో, యాక్షన్ సీన్స్ లో మాత్రం ఇంకా ఎక్స్ప్రెషన్స్ బాగా వచ్చి ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది.

chatrapathi movie review

అంతే కాకుండా కొన్ని సీన్స్ లో అయితే వాళ్లు సీరియస్ గా మాట్లాడుతూ ఉంటే ప్రేక్షకులకి కామెడీ అనిపిస్తుంది. తెలుగులో చాలా పెద్ద హిట్ అయిన సినిమా కాబట్టి ఇది చూస్తున్న ప్రేక్షకులు కచ్చితంగా తెలుగు సినిమాతో పోలుస్తారు. అలా పోల్చిన తర్వాత హిందీ రీమేక్ సినిమా చాలా విషయాల్లో బలహీనంగా అనిపిస్తుంది. యాక్షన్ సీన్స్ డిజైన్ చేసిన విధానం బాగుంది. కానీ సినిమా అంతా తెలుసు కాబట్టి ప్రేక్షకులకు ఎక్కడా కొత్తగా అనిపించదు. అలాగే టేకింగ్ పరంగా కూడా పెద్ద గొప్పగా లేదు కాబట్టి కనీసం చూడాలని ఆసక్తి కూడా పెద్దగా అనిపించదు.

ప్లస్ పాయింట్స్ :

  • నిర్మాణ విలువలు
  • కొన్ని యాక్షన్ సీన్స్

మైనస్ పాయింట్స్:

  • పాత కథ
  • రొటీన్ స్క్రీన్ ప్లే
  • పాటలు
  • ఎమోషన్స్ మిస్ అవ్వడం

రేటింగ్ :

2/5

ట్యాగ్ లైన్ :

ఛత్రపతి సినిమా చూడని తెలుగు ప్రేక్షకులు ఉండరు ఏమో. కాబట్టి ఒక వేళ హిందీ సినిమా చూడాలి అనుకుంటే ఆ సినిమాని ఒక వేరే సినిమా లాగా చూస్తే, అసలు మన ఒరిజినల్ సినిమాలో ఉన్న ఆ మ్యాజిక్ హిందీ రీమేక్ సినిమాలో ఎంత వరకు ఉందో తెలుసుకోవాలి అని చూస్తే ఈ సినిమా చాలా కష్టం మీద ఒక్కసారి చూడగలిగే సినిమాగా నిలుస్తుంది.

watch trailer : 


End of Article

You may also like