సాధారణంగా అటు సినీ ఇండస్ట్రీలోను, ఇటు రాజకీయాల్లోను ఎక్కువగా సెంటిమెంట్లకు ప్రాధాన్యత ఇస్తుంటారు. న్యూమరాలజీ, పూజలు, జాతకాలు, హోమాలు, మెడలో చైన్స్, చేతివేళ్ళకు ఉంగరాలు ధరించడం లాంటివి  కనిపిస్తూ ఉంటాయి.

Video Advertisement

సక్సెస్ కోసం, పేరు, ప్రఖ్యాతులను పెంచుకోవడం, అవకాశాల కోసం, అధికారం కోసం  జోతిష్య పండితులను లేదా ఆధ్యాత్మిక గురువులను రాజకీయ నేతలు దర్శించడం ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతోంది. రీసెంట్ గా పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధరించిన రెండు రింగ్స్  మీడియాలోను, రాజకీయంగాను చర్చకు దారి తీసింది. మరి ఆ రింగ్స్ ఏమిటి? అవి ధరిస్తే ఎలాంటి యోగం ఉంటుందో ఇప్పుడు చూద్దాం..
గతంలో పవన్ కల్యాణ్ పూజలు, జాతకాలకు అంటే కాస్త దూరంగా ఉంటారని టాలీవుడ్ లో టాక్ ఉండేది. కానీ రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాత పవన్ కల్యాణ్ లో ఆధ్యాత్మికంగా మార్పు కనిపిస్తోందని టాక్. జ్యోతిష్యు పండితులను కలిసి, జాతకంలో ఉన్న దోషాలను సరిద్దిద్దుకోనే ప్రయత్నం చేశారట. హరిద్వార్ లాంటి పుణ్యక్షేత్రంలో  పర్యటించారు. ఇటీవల అరెస్ట్ అయిన టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును పవన్ కళ్యాణ్ రాజమండ్రి సెంట్రల్ జైలులో కలిసిన విషయం తెలిసిందే.
చంద్రబాబును కలిసిన అనంతరం, పవన్ కళ్యాణ్, బాలయ్య, నారా లోకేష్ లతో పాటు మీడియాతో మాట్లాడారు. అయితే పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న సమయంలో పవన్ చేతి వేళ్లకు ఉన్న రింగ్స్ హైలెట్ అయ్యాయి. అప్పటి నుండి వాటి గురించే చర్చ జరుగుతోంది. ఆ ఉంగరాల విశిష్టత ఏమిటా అని చర్చిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పెట్టుకున్న రెండు రింగ్స్ లో ఒకటి నాగ బంధం, రెండవది కూర్మావతారం. ఈ రెండు కూడా బంగారు రింగ్స్. పెద్ద సైజులో కూడా ఉన్నాయి.నాగ బంధం, కూర్మావతారం రింగ్స్ కు విశిష్టత ఉందని, ఇవి పెట్టుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు. నాగ బంధం రింగ్ వల్ల అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. అనుకోని ప్రమాదాలు లేదా గండాల నుంచి కపడుతుంది. దుష్ట శక్తుల,రాహు కేతు దోషాలు మరియు నరదిష్టి దోషాల నుంచి కాపాడుతుందని పండితులు చెబుతున్నారు. కానీ నాగ బంధం ఉంగరాన్ని జోతిష్యం ఆధారంగా మాత్రమే ధరించాలని పండితులు చెబుతున్నారు.
ఇక తాబేలు లేదా కూర్మావతారం రింగ్ ధరించడం వల్ల అధికార యోగం మరియు ధన యోగం కలుగుతుందని,  అధికార యోగం కోసం దైవబలం కోరుకునేవారు తాబేలు రింగ్ ను ధరిస్తారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోందని అంటున్నారు. వచ్చే ఎన్నికల తర్వాత ఏపీ పాలిటిక్స్ లో పవన్ కళ్యాణ్ కింగ్ లేదా కింగ్ మేకర్ గా మారే అవకాశం ఈ రెండు రింగ్స్ వల్ల వస్తుందని జోతిష్య పండితులు అంటున్నారు.

Also Read: చంద్రబాబు నాయుడు మీద నమోదు చేసిన సెక్షన్స్ ఏంటి..? వాటికి ఎలాంటి శిక్షలు ఉంటాయి అంటే..?