మరో రెండు రోజుల్లో టీచర్స్ డే రాబోతోంది. తల్లితండ్రుల తరువాత అంతటి గౌరవనీయ స్థానం గురువు కే చెందుతుంది. వారికోసం ప్రత్యేకం గా సెప్టెంబర్ ఐదవ తేదీన ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహిస్తాం. ఉత్తమ ఉపాధ్యాయుడు డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని పునస్కరించుకుని.. ఆరోజున టీచర్స్ డే గా జరుపుకుంటున్నాం. విద్యార్థులంతా టీచర్స్ డే రోజు తమకు ఇష్టమైన గురువులకు బహుమతులు ఇవ్వాలని భావిస్తూ ఉంటారు. మీకు ఇష్టమైన టీచర్లకు ఎలాంటి బహుమతులు ఇస్తే బాగుంటుందో ఓ లుక్ వేయండి.

teachers day

ఇందుకోసం మీరు ఎక్కువ ఖరీదు ఏమి పెట్టాల్సిన అవసరం లేదు. మీ బడ్జెట్ లో మీరు ఇవ్వగలిగిన బహుమతి ని ప్రేమ గా గురువులకు ఇస్తే..ఆ సంతోషమే వేరు. చిన్న చిన్న పూల కుండీలను, ఏదైనా అరుదైన మొక్కను బహుమతి గా ఇవ్వొచ్చు. పూల బొకేలు కూడా ఇవ్వడానికి బాగుంటాయి.. కానీ రెండు మూడు రోజుల తర్వాత పడేయడం తప్ప ఏమి చెయ్యలేం. అదే ఏదైనా మొక్క అయితే.. వాటిని వారు మీ గుర్తు గా పెంచుకుంటారు. ఒకవేళ అంత ఖరీదు మీరు పెట్టలేం అనుకుంటే.. మీకు నచ్చిన విధం గా గ్రీటింగ్ కార్డు తయారు చేసి మీరు చెప్పాలనుకున్న మాటలను స్కెచ్ రాసి ఇవ్వండి. మీ టీచర్స్ ఎంతో సంతోషిస్తారు. ఒక మంచి డైరీ, మంచి పెన్, మంచి హ్యాండ్ బాగ్ లాంటివి తక్కువ బడ్జెట్ లో టీచర్స్ కు ఎంతో అవసరమైనవి. ఇలాంటి గిఫ్ట్స్ ను ఇస్తే మీ టీచర్స్ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు.