Ads
హార్రర్ సినిమాలకు ఎప్పుడూ ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఉంటుంది. సరైన కథ, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఉంటే హారర్ మూవీ ప్రేక్షకులను భయ పెట్టడం ఖాయం. ప్రేక్షకులలో భయానక కంటెంట్‌పై ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటూ మంచి హారర్ చిత్రాలను నిర్మిస్తున్నారు తెలుగు మేకర్స్.
Video Advertisement
ఇప్పుడు తెలుగులో వచ్చిన బెస్ట్ హారర్ మూవీస్ ఏవో చూద్దాం..
#1 కాష్మోరా
రాజేంద్ర ప్రసాద్, భాను ప్రియ, రాజా శేఖర్ ప్రధాన పాత్రల్లో వచ్చిన కాష్మోరా హారర్ మూవీస్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది.
#2 దెయ్యం
జయసుధ, జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రల్లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం లో వచ్చిన చిత్రం దెయ్యం. ఇప్పటికి ఈ మూవీ చేస్తుంటే భయం వేస్తుంది.
#3 మంత్ర
హీరోయిన్ ఛార్మి ప్రధాన పాత్రలో వచ్చిన మూవీ మంత్ర. ఈ మూవీ కూడా సూపర్ హిట్ అయ్యింది.
#4 అరుంధతి
దర్శకుడు కోడి రామకృష్ణ తెరకెక్కించిన ఈ చిత్రం, అనుష్క కి స్టార్డం తీసుకొచ్చింది.
#5 అవును
నటి పూర్ణ ప్రధాన పాత్రలో దర్శకుడు రవిబాబు తెరకెక్కించిన చిత్రం అవును. ఈ మూవీ కూడా విపరీతంగా భయపెడుతుంది.
#6 జెస్సి
దర్శకుడు అశ్వినీ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకుంది. ‘అసలు దెయ్యాలు ఉన్నాయా.. మనిషి చనిపోయిన తరువాత ఆత్మలు ప్రేతాత్మలుగా మారతాయా? లేదంటే అవి వట్టి రూమర్లేనా అని తేల్చడానికి కొంత మంది ఘోస్ట్ హంటర్లు చేసిన అన్వేషణే ‘జెస్సీ’ మూవీ.
#7 రాత్రి
రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన మరో హారర్ మూవీ రాత్రి. ఇందులో రేవతి ప్రధాన పాత్రలో నటించింది.
#8 భాగమతి
అనుష్క ప్రధాన పాత్రలో వచ్చిన మరో హారర్ మూవీ భాగమతి. ఈ చిత్రం కూడా సూపర్ హిట్ అయ్యింది.
#9 రక్ష
చేతబడి నేపథ్యం లో వచ్చిన మూవీ రక్ష. ఈ మూవీ కూడా జనాలను విపరీతంగా భయపెట్టింది. ఇందులో జగపతి బాబు, కళ్యాణి కీలక పాత్రలు పోషించారు.
#10 మసూద
ఇటీవలి కాలం లో ప్రేక్షకులను అంతగా భయపెట్టిన మూవీ ఏదైనా ఉంది అంటే అది మసూద మూవీ నే. ఇందులో సీనియర్ నటి సంగీత ప్రధాన పాత్రలో నటించగా కావ్య కళ్యాణ్ రామ్, తిరువీర్ ముఖ్యమైన పాత్రలో నటించారు.
#11 మర్రి చెట్టు
హారర్ మూవీస్ స్పెషలిస్ట్ రామ్ గోపాల్ వర్మ తీసిన మరో హారర్ మూవీ మర్రి చెట్టు. ఈ మూవీ లో జేడీ చక్రవర్తి, సుస్మిత సేన్ ప్రధాన పాత్రల్లో నటించారు.
#12 విరూపాక్ష
ఇక ఇటీవల విరూపాక్ష అనే హారర్ చిత్రం తో ప్రేక్షకుల ముందుకి వచ్చారు హీరో సాయి ధరమ్ తేజ్. ఈ మూవీ కూడా హిట్ టాక్ తెచ్చుకుంది.
End of Article