మలయాళ ఇండస్ట్రీ స్థాయిని పెంచిన గొప్ప సినిమా అంటే ఇదే..! ఈ సినిమా చూశారా..?

మలయాళ ఇండస్ట్రీ స్థాయిని పెంచిన గొప్ప సినిమా అంటే ఇదే..! ఈ సినిమా చూశారా..?

by Mohana Priya

Ads

సాధారణంగా మలయాళం సినిమాలు అంటేనే కంటెంట్ బలంగా ఉంటుంది అని అంటారు. మలయాళం ఇండస్ట్రీలో అన్ని మంచి సినిమాలు వస్తాయి అని అనలేం. కానీ సాధారణంగా ఎవరైనా సరే చేయడానికి భయపడి, సంకోచించే ప్రయోగాత్మక సినిమాలని మలయాళం సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చేసి చూపిస్తారు. స్టార్ హీరో అయినా పర్వాలేదు, కొత్త రకమైన పాత్రలు చేయడం అనేది వారి ఇమేజ్ కి అడ్డురాదు అనే విషయాన్ని నిరూపిస్తూ ఉంటారు.

Video Advertisement

best malayalam movie in recent time

మలయాళంలో టాప్ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్. ఇప్పుడు పుష్ప సినిమాలో కూడా నటిస్తున్నారు. ఆయన చేయని పాత్ర లేదు. ఎన్నో వేరియేషన్స్ ఉన్న పాత్రలు పోషిస్తూ ఉంటారు. ఫహద్ ఫాసిల్ ముఖ్య పాత్రలో 2019 లో వచ్చిన సినిమా కుంబళంగి నైట్స్. మధు సి. నారాయణన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కథని, శ్యామ్ పుష్కరన్ రాశారు. ఫహద్ ఫాసిల్, నజ్రియా నజీమ్, దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్ కలిసి ఈ సినిమాని నిర్మించారు.

best malayalam movie in recent time

ఈ సినిమాలో సౌబిన్ షాహిర్, షేన్ నిగమ్, శ్రీనాథ్ భాసి, మాథ్యూ థామస్ కూడా ముఖ్య పాత్రల్లో నటించారు. ఎవరి పాత్రలు వారివే. ఎవరి పాత్ర ప్రాముఖ్యత వారిదే. సాజి (సౌబిన్ షాహిర్), బోనీ (శ్రీనాథ్ భాసి), బాబీ (షేన్ నిగమ్), ఫ్రాంకీ (మాథ్యూ థామస్) కుంబళంగి అనే ప్రాంతంలో ఉండే అన్నదమ్ములు.  వారిలో బాబీ అనే వ్యక్తి వాళ్ళ ఇంటి దగ్గరే ఉండే బేబీ (అన్నా బెన్) ని ప్రేమిస్తాడు. బేబీ అక్క భర్త షమ్మీ శ్రీనివాస్‌ (ఫహద్ ఫాసిల్). తర్వాత వారి జీవితాల్లో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి అనే విషయాన్ని సినిమాలు చూపిస్తారు. సినిమా కథ చాలా సింపుల్ గా ఉంటుంది.

best malayalam movie in recent time

కానీ ఇంత సహజంగా మాత్రం ఎవరు తీయలేరు ఏమో. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఎన్నో ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా తర్వాత లాక్ డౌన్ వచ్చింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని చూశారు. ఎంతో మంది సినీ ప్రముఖులు ఈ సినిమాని అభినందించారు. అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా మలయాళంలో అందుబాటులో ఉంది. ఎన్నో ఫిలిం ఫెస్టివల్స్ లో కూడా ఈ సినిమాని ప్రదర్శించారు. అక్కడ కూడా ఈ సినిమా చూసిన వాళ్ళందరూ కూడా అభినందించారు.

ALSO READ : “పబ్లిక్ లో ఇలాంటి పదాలు మాట్లాడడం ఏంటి..?” అంటూ… “విజయ్ దేవరకొండ” మీద కామెంట్స్..! అసలు ఏం జరిగిందంటే..?


End of Article

You may also like