ఇటీవల కాలంలో వచ్చిన బెస్ట్ సినిమా అంటే ఇదే ఏమో..? ఈ సినిమా చూశారా..?

ఇటీవల కాలంలో వచ్చిన బెస్ట్ సినిమా అంటే ఇదే ఏమో..? ఈ సినిమా చూశారా..?

by kavitha

Ads

మలయాళీ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పలు డబ్బింగ్ సినిమాల ద్వారా పృథ్వీరాజ్ తెలుగు ఆడియెన్స్ కు ద‌గ్గ‌ర‌య్యారు. టాలీవుడ్ లో ఆయనిని అభిమానించే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది.

Video Advertisement

పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన సినిమాలలో జనగణమన ఒకటి. ఈ మూవీ మళయంలో రిలీజ్ అయ్యి, సూపర్ హిట్ గా నిలిచింది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉన్న ఈ మూవీ స్టోరీ ఏమిటో? ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగువారికి చేరువైన మలయాళీ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ నటిస్తున్న ‘సలార్’లో విలన్ గా నటిస్తున్నారు. ఆయన నటించిన జనగణమన మూవీ 2022లో థియేటర్లలో రిలీజ్ అయ్యి, విజయం సాధించింది. ఈ మూవీలో సూరజ్ వెంజారమూడు, మమతా మోహన్‌దాస్ కీలక పాత్రలలో నటించారు.
ఈ మూవీ కథ విషయానికి వస్తే, లెక్చరర్ సభా మరియం (మమతా మోహన్ దాస్)ను అత్యాచారం చేసి, ఆమె బాడీని కాల్చి రోడ్డు పక్కన పడేశారనే వార్త  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఆమె పనిచేసిన యూనివర్సిటీ విద్యార్ధులు తమ లెక్చరర్ కు న్యాయం చేయాలని ఆందోళనకు దిగుతారు. సభా మరియం తల్లి న్యాయం కోసం పోరాటం ప్రారంభిస్తుంది. ఈ కేసును చేధించేందుకు ఏసీపీ సజ్జన్(సూరజ్ వెంజనమూడు) వస్తాడు. ఆ క్రమంలో ప్రత్యక్షసాక్షి చెప్పిన సాక్ష్యంతో నలుగురు నిందితులను పట్టుకుంటాడు.
సొసైటీ నుండి నిందితులను చంపేయాలనే డిమాండ్ వస్తుంది. పై నుంచి ప్రెజర్ ఎక్కువ అవడంతో ఏసీపీ సజ్జన్ వారిని మరో స్టేషన్ కు తరిలించే టైమ్ లో నిందితులను ఎన్ కౌంటర్ చేస్తాడు. అయితే ఈ  ఎన్ కౌంటర్ పై  హ్యూమన్ రైట్స్ కమీషన్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కేసు పెడుతుంది. ఈ కేసులో లాయర్ అరవింద్ స్వామినాథన్ (పృథ్వీరాజ్ సుకుమారన్) ఏసీపీ సజ్జన్ కు వ్యతిరేకంగా కేసు వాదిస్తాడు. ఆ తరువాత ఏం జరిగింది? అసలు అరవిందన్ ఎవరు?  ఎందుకు ఎన్ కౌంటర్ చేశారు? సభా మరియం ఎలా చనిపోయింది? అనేది మిగిలిన కథ.
జన గణ మన మూవీలో ఎన్ని పాత్రలున్నప్పటికీ  ప్రధమార్ధంలో ఏసీపీ సజ్జన్, ద్వితీయార్థం అంతా పృథ్వీరాజ్ తమ నటనతో ఆడియెన్స్ ని కట్టిపడేస్తారు. సభా మరియంగా మమతా మోహన్ దాస్ బాగా నటించింది. రోజూ చూసే వార్తల్లోని మరో యాంగిల్ ను ఆవిష్కరించేలా ఈ చిత్రాన్ని దర్శకుడు డిజో జోస్ ఆంటోని తెరకెక్కించారు.

Also Read: “లైన్ క్రాస్ అయ్యింది… అందుకే కఠినమైన నిర్ణయం..!” అంటూ… “రామ్ చరణ్” అభిమాని లెటర్..! ఏం అన్నారంటే..?


End of Article

You may also like