హీరోలకి, అభిమానులకి అవినాభావ సంబంధం ఉంటుంది. వారికి వ్యక్తిగతంగా ఒకరికి ఒకరు తెలియకపోయినా కూడా సినిమా అనే ఒక మాధ్యమం ద్వారా వారికి ఒక రిలేషన్ ఏర్పడుతుంది. “మా హీరో” అని ఆ అభిమానులు అనుకుంటూ ఉంటే, “నా అభిమానులు” అని ఆ హీరోలు అనుకుంటూ ఉంటారు.

Video Advertisement

అయితే సౌత్ ఇండియాలో హీరోలని అభిమానించడం కంటే పూజించడం ఎక్కువగా ఉంటుంది అని చాలా మంది అన్నారు. అది నిజం. వారి సినిమాలు వస్తున్నాయి అంటే కటౌట్లకి పాలాభిషేకాలు చేయడం, దండలు వేయడం, పూజలు లాంటివి చేయడం కూడా చేస్తారు.

అందుకే చాలా మంది హీరోలు కూడా ఏదైనా ఈవెంట్ లో మాట్లాడేటప్పుడు వారి అభిమానుల గురించి మాట్లాడుతూ, “ఏం ఇచ్చినా సరే మీరు రుణం తీర్చుకోలేను” అని అంటారు. అయితే ఈ అభిమానం ఒక్కొక్కసారి చాలా ఎక్కువైపోయి కొన్ని అనుకోని సంఘటనలకు దారి తీస్తుంది. రవితేజ హీరోగా నటించిన నేనింతే అనే సినిమాలో హీరో పాత్ర పోషించిన సుబ్బరాజుని అభిమానించే ఒక వ్యక్తి అప్పులు చేసి ఆ హీరో కోసం ఆ సినిమా కోసం పబ్లిసిటీ చేయడం, ఆ తర్వాత సినిమా పోవడంతో ఆత్మహత్య చేసుకోవడం చూసి, “ఇలాంటివి నిజంగా జరుగుతాయా?” అని అనుకుంటాం.

comments on a letter from ram charan fan

From : Babu Goud (Twitter)

కానీ సినిమాలు కూడా నిజ జీవితంలో నుండి పుట్టినవే అనే విషయం మర్చిపోతాం. ఇప్పుడు దాదాపు ఇలాంటి సంఘటన జరిగింది. ఒక రామ్ చరణ్ అభిమాని లెటర్ రాసి మరి ఈ పని చేశారు. ఇందులో ఆ అభిమాని ఈ విధంగా రాశారు, “నా కుటుంబానికి, స్నేహితులకి, ప్రియమైన వారికి, చాలా బరువైన గుండెతో నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. ఇదే విషయాన్ని రాస్తున్నాను. ఒక రామ్ చరణ్ అభిమానిగా ఆయన రాబోతున్న గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ డేట్ కోసం రెండు సంవత్సరాల నుండి ఎంతో ఓపికగా ఎదురు చూస్తున్నాను. కానీ నిర్మాణ సంస్థ నుండి ఎటువంటి వార్తలు లేవు.”

“అందుకే వారు ఏం చేయకపోవడం వల్ల ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియాలి అని అనుకుంటున్నాను. నేను వారికి సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడానికి మూడు రోజుల గడువు ఇస్తున్నాను. ఒకవేళ వాళ్ళు అనౌన్స్ చేయకపోతే నేను నా జీవితాన్ని అంతం చేసుకుంటాను. ఒకవేళ అలా జరిగితే, నా చా-వుకి, శంకర్ షణ్ముగం, దిల్ రాజు, SVC ప్రొడక్షన్ హౌస్ కారకులు అవుతారు. మీరు నా నిర్ణయాన్ని అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నాను. దీని వల్ల ఫలితం వస్తుంది. లవ్ యు. నేను చేసిన పనులకి సారీ. లవ్ యు చరణ్ అన్న, మిస్ యు సో మచ్.”

comments on a letter from ram charan fan

“వచ్చే జన్మలో అయినా నీకు ఒక గొప్ప అభిమానిగా ఉంటాను అని అనుకుంటున్నాను. లవ్ యు సో మచ్. నీ, బాబు గౌడ్.” అని ఈ లెటర్ లో రాశారు. సోషల్ మీడియాలో ఉన్న ఈ లెటర్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే, ఇది చూసిన చాలా మంది మాత్రం, “దీన్ని అభిమానం కాదు. మూర్ఖత్వం అంటారు” అని అంటున్నారు. ఎందుకంటే, “మనం అభిమానించే హీరోతో పాటు, సినిమా బృందం అంతా కూడా రాత్రి, పగలు, అసలు సంవత్సరాలు తేడా లేకుండా సినిమా కోసం కష్టపడుతున్నారు. అలాంటి వాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకోవడం పోయి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయడం మంచి విషయం కాదు” అని అంటున్నారు.

ALSO READ : “బ్రహ్మానందం” ని విపరీతంగా ట్రోల్ చేస్తున్న తమిళ్ ఆడియన్స్..! కారణం ఏంటంటే..?