“పుష్ప” తో పాటు… “అల్లు అర్జున్” ని ఐకాన్ స్టార్ చేసిన 13 సూపర్ హిట్ సినిమాలు..!

“పుష్ప” తో పాటు… “అల్లు అర్జున్” ని ఐకాన్ స్టార్ చేసిన 13 సూపర్ హిట్ సినిమాలు..!

by Harika

Ads

“గంగోత్రి” సినిమాతో తెలుగు తెరకు పరిచమయ్యాడు అల్లు అర్జున్. అల్లు అరవింద్ కుమారుడిగా, మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా తొలి అడుగు ప్రారంభించినా.. ప్రతీ సినిమాలో తనకుంటూ ఓ స్టైల్ ను ఫాలోఅవుతూ.. స్టైలిష్ స్టార్ గా పేరు తెచ్చుకుని, ఓ ట్రెండ్ సెట్ చేశాడు. పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ గా మారి.. పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు బన్నీ.

Video Advertisement

ఇక డాన్స్ అంటే బన్నీకి ప్రాణం. పాటలకు తనదైన స్టెప్పులతో ప్రాణం పోస్తాడు. మెగాస్టార్ “డాడీ” సినిమాలో మెరిసిన అల్లు అర్జున్.. డాన్స్ స్టూడెంట్‌గా కనిపించాడు. పలు చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన అల్లు అర్జున్.. 2003 లో డైరెక్టర్ రాఘవేంద్రరావు దర్శకత్వం లో హీరో గా పరిచయం అయ్యాడు. తన మూడో చిత్రం ‘బన్నీ’ తో హ్యాట్రిక్ హిట్ కొట్టాడు. ఈ సినిమా నుంచే అల్లు అర్జున్ ని బన్నీ అని పిలవడం మొదలుపెట్టారు.

list of best performances by allu arjun..!!

కేరళలో మమ్ముట్టి, మోహన్ లాల్ తర్వాత అల్లు అర్జున్ కే ఎక్కువ అభిమానులు ఉన్నారు. అక్కడ బన్నీని మల్లు అర్జున్ అని పిలుస్తుంటారు ఫ్యాన్స్. ఇప్పటివరకు అల్లు అర్జున్ విభిన్న కథలను ఎంచుకుంటూ అభిమానులను అలరించాడు. ఇక త్వరలో పుష్ప 2 తో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. అయితే ఇప్పటివరకు తన కెరీర్ లో అల్లు అర్జున్ చేసిన బెస్ట్ మూవీస్ ఏవో ఇప్పుడు చూద్దాం..

#1 ఆర్య

తన రెండో చిత్రం దర్శకుడు సుకుమార్ తో చేసాడు అల్లు అర్జున్. ఈ చిత్రం తో ఇండస్ట్రీ లో నటుడిగా తనదైన ముద్ర వేశాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకు నంది అవార్డు లభించింది.

list of best performances by allu arjun..!!

#2 దేశముదురు

పూరి జగన్నాథ్ దర్శకత్వం లో దేశముదురు మూవీ చేసాడు బన్నీ. ఈ సిక్స్ ప్యాక్ చేసి అందరిని మెప్పించాడు. ఈ మూవీ తో మాస్ హీరోగా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు.

list of best performances by allu arjun..!!

#3 పరుగు

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం లో పరుగు చిత్రం చేసాడు అల్లు అర్జున్. ఈ చిత్రం లో సెటిల్డ్ యాక్టింగ్ తో అందర్నీ మెప్పించాడు. ఈ చిత్రానికి కూడా నంది అవార్డు గెలుచుకున్నాడు బన్నీ.

list of best performances by allu arjun..!!

#4 ఆర్య 2

సుకుమార్ దర్శకత్వం లో మరోసారి నటించిన బన్నీ.. ఆర్య 2 లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించాడు.

list of best performances by allu arjun..!!

#5 వేదం

క్రిష్ దర్శకత్వం లో మల్టీస్టారర్ లో నటించిన అల్లు అర్జున్ ఈ చిత్రానికి ఫిలిం ఫేర్ అవార్డు గెలుచుకున్నారు.

list of best performances by allu arjun..!!

#6 రేసు గుర్రం

సురేందర్ రెడ్డి దర్శకత్వం లో ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో నటించిన అల్లు అర్జున్ ఈ చిత్రం తో మరో మెట్టు పైకి ఎక్కారు.

list of best performances by allu arjun..!!

#7 సన్ ఆఫ్ సత్యమూర్తి

త్రివిక్రమ్ దర్శకత్వం లో అల్లు అర్జున్ మొదటిసారి జులాయి మూవీ లో నటించారు. ఆ తర్వాత వీరి కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం కూడా సూపర్ హిట్ అయ్యింది.

list of best performances by allu arjun..!!

#8 రుద్రమదేవి

కాకతీయ వంశపు రాణి రుద్రమదేవి చరిత్ర ఆధారం గా వచ్చిన ఈ చిత్రం లో అల్లు అర్జున్ గోన గన్నారెడ్డి పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.

list of best performances by allu arjun..!!

#9 సరైనోడు

బోయపాటి శ్రీను దర్శకత్వం లో వచ్చిన ఈ చిత్రం తో అల్లు అర్జున్ మాస్ హిట్ అందుకున్నారు.

list of best performances by allu arjun..!!

#10 నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా

వక్కంతం వంశి దర్శకత్వం లో నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రాన్ని చేసారు అల్లు అర్జున్. ఈ చిత్రం పరాజయం పొందినా నటుడిగా అల్లు అర్జున్ కి మంచి మార్కులే పడ్డాయి.

list of best performances by allu arjun..!!

#11 దువ్వాడ జగన్నాథం

మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం లో డీజే మూవీ లో రెండు పాత్రల్లో నటించి మెప్పించారు అల్లు అర్జున్.

list of best performances by allu arjun..!!

#12 అల వైకుంఠపురంలో

త్రివిక్రమ్ దర్శకత్వంలో అల వైకుంఠపురంలో తో హ్యాట్రిక్ హిట్ కొట్టాడు అల్లు అర్జున్. సంక్రాంతి బరిలో దిగిన ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డులను చెరిపేసి, సరికొత్త రికార్డులను క్రియోట్ చేసింది. అల్లు అర్జున్ కెరీర్ లో బెస్ట్ మూవీగా నిలిచింది.

list of best performances by allu arjun..!!

#13 పుష్ప

తనని స్టార్ హీరో గా నిలబెట్టిన క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తో పుష్ప మూవీ ని చేసారు అల్లు అర్జున్. ఐకాన్ స్టార్ గా మారిన బన్నీ ఈ మూవీ తో భారీ విజయాన్ని అందుకున్నాడు.

list of best performances by allu arjun..!!

End of Article

You may also like