Ads
దర్శకులు విభిన్న స్టోరీలతో సినిమాలను తెరకెక్కిస్తుంటారు. కొందరు ప్రేమ కథలతో సినిమాలు తీస్తే, మరికొందరు క్రీడా నేపథ్యంలో, కొందరు రాజకీయల నేపథ్యంలో సినిమాలను తెరకెక్కిస్తుంటారు. అలా తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎన్నో చిత్రాలు రాజకీయాల ఆధారంగా రూపొందాయి.
Video Advertisement
వీటిలో విజయం సాధించిన చిత్రాలు ఎక్కువ శాతం ఉంటాయని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రాలలో పొలిటికల్ లీడర్ పాత్రలో నటించిన హీరోల పాత్రలు ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయాయి. అలాంటి 10 బెస్ట్ పొలిటికల్ సినిమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
1. లీడర్:
రానా దగ్గుబాటి హీరోగా నటించిన మొదటి సినిమా. 2010లో రిలీజ్ అయిన తెలుగు పొలిటికల్ డ్రామా. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ మూవీలో రిచా గంగోపాధ్యాయ్, ప్రియా ఆనంద్ హీరోయిన్లు నటించారు.
2. నేనే రాజు నేనే మంత్రి:
రానా దగ్గుబాటి హీరోగా తేజ దర్శకత్వం తెరకెక్కిన మూవీ నేనే రాజు నేనే మంత్రి. ఈ మూవీ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఈ మూవీలో కాజల్ అగర్వాల్, కేథరిన్ థ్రెసా హీరోయిన్లుగా నటించారు.
3. భరత్ అనే నేను:
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్ యాక్షన్ మూవీ భరత్ అనే నేను. ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించగా, ప్రకాష్ రాజ్, శరత్ కుమర్, ఆమని కీలక పాత్రల్లో నటించారు.
4. ప్రస్థానం:
హీరో శర్వానంద్, సాయి కుమార్ మరియు సందీప్ కిషన్ ప్రధాన పాత్రలు పోషించిన ప్రస్థానం మూవీకి దేవా కట్టా దర్శకత్వం వహించారు. 2010లో రిలీజ్ అయిన ఈ మూవీ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది. 5. వంగవీటి:
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈ మూవీ విజయవాడలోని ప్రముఖ పొలిటికల్ లీడర్ వంగవీటి మోహనరంగా, మరియు ఆయన సోదరుడు వంగవీటి రాధామోహన్ జీవితం ఆధారంగా తెరకెక్కింది.
6. రంగం:
పొలిటికల్ స్టోరీతో తెరకెక్కిన ఈ మూవీ తమిళ సినిమా. తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఇక్కడా కూడా సూపర్ హిట్ గా నిలిచింది ఈ మూవీలో జీవా, కార్తీకా నాయర్ జంటగా నటించారు.
7. ప్రతినిధి:
హీరో నారా రోహిత్ ప్రధాన పాత్రలో నటించిన ప్రతినిధి మూవీ 2014లో రిలీజ్ అయిన పొలిటికల్ థ్రిల్లర్. ఈ మూవీకి ప్రశాంత్ మండవ దర్శకత్వం వహించారు.
8. ఒకే ఒక్కడు:
అర్జున్ హీరోగా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన పొలిటికల్ మూవీ ఒకే ఒక్కడు 1999లో విడుదలై తమిళ, తెలుగు భాషలలో సంచలన విజయం సాధించింది. విజయం సాధించిన తమిళ అనువాద చిత్రం. మనీషా కొయిరాలా, రఘువరన్ కీలక పాత్రల్లో నటించారు. 9. నోటా:
విజయ్ దేవరకొండ హీరోగా నటించి నోటా మూవీ రాజకీయ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ మూవీకి ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించారు. మెహ్రీన్ పిర్జాదా హీరోయిన్ గా నటించగా, నాజర్ కీలకపాత్రలో నటించారు.
10. రిపబ్లిక్:
సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన రిపబ్లిక్ కి దేవా కట్టా దర్శకత్వం వహించారు. పొలటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో జగపతిబాబు, ఐశ్వర్య రాజేష్, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో నటించారు.
Also Read: “పవన్ కళ్యాణ్” చేతులకి పెట్టుకున్న ఈ ఉంగరాలు ఏంటో తెలుసా..? వీటి వల్ల ఎలాంటి యోగం కలుగుతుంది అంటే..?
End of Article