బోయపాటి శీను దర్శకత్వం వహించిన మొదటి సినిమా భద్ర. మొదటి సినిమాకే సూపర్ హిట్ అందుకున్నారు బోయపాటి శ్రీను. మాస్ మహారాజా రవితేజ, మీరా జాస్మిన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాని దిల్ రాజు గారు నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

Bhadra movie actress sanober herekar

ప్రకాష్ రాజ్, అర్జన్ బజ్వా, ఈశ్వరి రావు ముఖ్య పాత్రల్లో నటించారు. ఇందులో ఇంకొక ముఖ్య పాత్ర, హీరో మరదలుగా నటించిన సత్య పాత్ర. ఈ పాత్ర పోషించిన నటి పేరు సనోబర్ హెరేకర్. తను కనిపించేది కొంచెంసేపు అయినా కూడా ప్రేక్షకులకి సత్య పాత్ర గుర్తుండిపోయింది. అయితే ఆ తర్వాత సనోబర్ హెరేకర్ మరి ఎక్కడా కనిపించలేదు.

Bhadra movie actress sanober herekar

సినిమా వచ్చి 16 సంవత్సరాలు అయ్యింది. అయినా సరే భద్ర తర్వాత ఇప్పటివరకు ఒక్క తెలుగు సినిమాలో కూడా నటించలేదు సనోబర్ హెరేకర్. సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్ గా లేరు. సనోబర్ హెరేకర్ కి ట్విట్టర్ అకౌంట్ ఉంది. అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం సనోబర్ హెరేకర్ ప్రస్తుతం ఒక మ్యూజిక్ లేబుల్ కి బిజినెస్ హెడ్ గా ఉన్నారు.

Bhadra movie actress sanober herekar

ఆ మ్యూజిక్ లేబుల్ పేరు క్రెసెండో మ్యూజిక్. ఈ మ్యూజిక్ లేబుల్ ద్వారా కొన్ని హిందీ పాటలను విడుదల చేశారు. ట్విట్టర్ లో కూడా 2016 లో ట్వీట్ చేశారు. సనోబర్ హెరేకర్, అజీజ్ జీ అనే ఒక ఆర్టిస్ట్ ని పెళ్లి చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేకపోవడంతో, ఎక్కడ ఇంటర్వ్యూలు కూడా ఇవ్వకపోవడంతో ఇప్పుడు సనోబర్ హెరేకర్ ఎక్కడ ఉన్నారో, ఎలా ఉన్నారో, ఏం చేస్తున్నారో ఎవరికీ తెలీదు.