నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమా, తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ నటించిన లియో సినిమా నిన్న ఒకేరోజు విడుదలయ్యాయి. రెండు సినిమాలకి ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది. రెండు సినిమాలు కూడా పోటా పోటీగా థియేటర్లలో రిలీజ్ అయ్యాయి.

Video Advertisement

బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాకు అయితే ఫ్యాన్స్ కేరింతల కొడుతున్నారు. బాలకృష్ణను మునుపెన్నడు చూడని విధంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి స్క్రీన్ మీద ప్రజెంట్ చేశారు. శ్రీ లీల , బాలయ్య మధ్య వచ్చిన ఎమోషనల్ సీన్స్ కైతే ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు.

bhagavanth kesari movie review

మరో పక్క తమిళ్ డబ్బింగ్ సినిమా లియోకి కూడా తెలుగు రాష్ట్రాల్లో జనం పోటెత్తడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. దీనికి ఏకైక కారణం డైరెక్టర్ లోకేష్ కనగరాజుగా చెబుతున్నారు. ఆయన ఇంతకుముందు డైరెక్ట్ చేసిన విక్రమ్, ఖైదీ సినిమాలు ఇక్కడ సూపర్ హిట్ అవడం దీనికి కారణం. ఆ సినిమాలకు లియో సినిమాలకు లింక్ ఉందనే టాక్ రావడంతో క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

leo movie review

ఇప్పుడు ప్రేక్షకులు దృష్టి రెండు సినిమాల కలెక్షన్స్ మీద పడింది. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటూ ఆరాలు తీస్తున్నారు. ట్రేడ్ వర్గాల ప్రకారం బాలకృష్ణ సినిమా కంటే డబ్బింగ్ సినిమాలు రావడం సినీ వర్గాలను ఆశ్చర్యపరుస్తుంది. బాలకృష్ణ సినిమాకి మొదటి రోజు టికెట్లు సులభంగానే దొరికాయి. బుక్ మై షో లో కూడా చాలా కేంద్రాల్లో సీట్లు ఖాళీగా దర్శనమిస్తూ గ్రీన్ బాక్సులు కనిపించాయి.

leo movie review

లియో సినిమాకి టికెట్లు అన్నీ ఫీల్ అయిపోయినట్లు కనిపించింది. తెలుగులో బాలకృష్ణ రేంజ్ తో పోలిస్తే విజయ్ ది చాలా తక్కువ. అయినా కానీ లియో సినిమాపైనే తెలుగు ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ లెక్కన చూస్తే తెలుగులో బాలకృష్ణను విజయ్ డామినేట్ చేసినట్లే.

Also Read: చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది..! ఈ సినిమా చూశారా..?