బాలీవుడ్ లో ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న భాగ్యశ్రీ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఈమె అందరికీ సుపరిచితమే. టాప్ హీరోయిన్ గా ఈమె మంచి పేరు తెచ్చుకున్నారు ఈమె. ‘మైనే ప్యార్ కియా’ సినిమా లో భాగ్యశ్రీ సల్మాన్ ఖాన్ సరసన నటించి చక్కటి పేరుని పొందారు.

Video Advertisement

తెలుగులో ఈ సినిమా ప్రేమ పావురాలు కింద విడుదలైంది కూడా. కనుక భాగ్యశ్రీ అటు బాలీవుడ్ ప్రేక్షకులకు ఇటు టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా పరిచయం అయ్యింది.

తర్వాత బాలకృష్ణ తో ఒక తెలుగు సినిమా చేసి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు భాగ్యశ్రీ. నిజానికి ఆమె తక్కువ సినిమాలే చేసినప్పటికీ ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్నారు. ఆ తరవాత ఇండస్ట్రీకి దూరం అయ్యారు ఈమె.

ఇక ఇది ఇలా ఉంటే ‘రాధే శ్యామ్’ సినిమాలో భాగ్యశ్రీ రీ ఎంట్రీ ఇచ్చారు కూడా. అయితే ఇప్పుడు భాగ్యశ్రీ కూతురు ‘అవంతిక దుస్సాని’ పేరు ఎక్కువగా వినపడుతోంది. దీని వెనుక కారణం ఏమిటంటే భాగ్యశ్రీ కూతురు అవంతిక దుస్సాని ఓ తెలుగు చిత్రంలో నటిస్తోందని తెలుస్తోంది.

భాగ్యశ్రీ కూతురు అయిన అవంతిక దుస్సాని బెల్లంకొండ గణేష్ సరసన ‘నేను స్టూడెంట్ సర్’ చిత్రంలో నటిస్తున్నారు. సతీష్ వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. రాఖీ ఉప్పలపాటి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రానికి కథ కృష్ణ చైతన్య తీసుకు వచ్చారు. అయితే అవంతిక దుస్సాని హీరోయిన్ గా ఈ సినిమాలో హీరోయిన్ గా బెల్లంకొండ గణేష్ సరస నటిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అయింది. ఇది ఇలా ఉంటే ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రంలో సముద్రఖని, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో చూడాలి.