Ads
ప్రియమణి లీడ్ రోల్ లో నటించిన ‘భామాకలాపం’ 2022లో రిలీజ్ అయ్యి, విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన భామాకలాపం 2 నేడు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో రిలీజ్ అయ్యింది. థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
Video Advertisement
- చిత్రం : భామా కలాపం 2.
- నటీనటులు : ప్రియమణి, శరణ్య ప్రదీప్, సీరత్ కపూర్, సందీప్ వేద్ తదితరులు..
- నిర్మాత : బాపినీడు భోగవల్లి, సుధీర్ ఈదర.
- దర్శకత్వం : అభిమన్యు తడిమేటి
- సంగీతం : ప్రశాంత్ ఆర్ విహారి
- విడుదల తేదీ : ఫిబ్రవరి 16, 2024
- ఓటీటీ : ఆహా
స్టోరీ:
భామాకలాపం తొలి పార్ట్ ఎండింగ్ అయిన దగ్గర నుండి సీక్వెల్ మొదలవుతుంది. అనుపమ (ప్రియమణి) కొత్త ఇంటికి మారడంతో అక్కడ ఆమె లైఫ్ మరింత సంతోషంగా మారుతుంది. ఇతరుల సంగతులు పట్టించుకోనని అనుపమ భర్తకు మాట ఇస్తుంది. ఆమె యూట్యూబ్ ఛానెల్ కు సబ్‌స్క్రైబర్స్ వన్ మిలియన్ దాటుతారు. ఆ ఛానెల్ ద్వారా వచ్చిన డబ్బుతో పాత ఇంట్లో పని చేసిన శిల్ప (శరణ్య ప్రదీప్) ను పార్ట్‌నర్ చేసుకొని ‘అనుపమ ఘుమఘుమ’ పేరుతో రెస్టారెంట్‌ను మొదలుపెడుతుంది.
అంతా హ్యాపీ అనుకుంటూ ఉండగా, ఒక సమస్య వస్తుంది. దానిని సాల్వ్ చేయడం కోసం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎక్స్ ఆఫీసర్ ను సంప్రదిస్తుంది. అయితే ముందు అంగీకరించిన ఆఫీసర్, ఆ తర్వాత 2 ఆప్షన్లు ఇచ్చి, ఏదో ఒకటి చేయాలని అంటాడు. అసలు ఆ ఆఫీసర్ ఎందుకు మారాడు?వెయ్యి కోట్ల విలువ ఉన్న కోడి పుంజు బొమ్మను దొంగిలించే ప్రయత్నంలో అనుపమకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అందులో ఏం ఉంది? ఈ స్టోరీలో జుబేదా (సీరత్ కపూర్) పాత్ర ఏమిటి? వంటి ప్రశ్నలకి సమాధానం తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే.
రివ్యూ :
ఇటీవల కాలంలో సీక్వెల్స్ హవా కనిపిస్తోంది. ఒకే స్టోరీని 2, 3 పార్ట్స్ గా తెరకెక్కించడం ట్రెండ్ గా మారింది. ఈ మూవీ మొదటి పార్ట్ గుడ్డు చుట్టూ తిరుగగా, రెండో పార్ట్ లో దర్శకుడు కోడి పుంజు బొమ్మ చుట్టూ కథను రాసుకున్నాడు. అనుపమ కుటుంబం కొత్త ఇంటికి మారడం,రెస్టారెంట్‌ను మొదలుపెట్టడం, చూపిస్తూనే, దర్శకుడు మరో వైపు ఆంటోనీ లోబో, జుబేదా వంటి కొత్త క్యారెక్టర్లను పరిచయం చేస్తూ, వారిని స్టోరీకి కనెక్ట్ అయ్యేలా చూపించాడు.
అనుపమ-శిల్ప కామెడీ ట్రాక్, జుబేదా గ్లామర్ ఆకట్టుకుంటాయి. అక్కడక్కడా కొన్ని సీన్స్ ఎక్కువ ల్యాగ్ అయిన భావన వస్తుంది. అనుపమ యాక్సిడెంట్ చేయడంతో స్టోరీ మలుపు తిరుగుతుంది. విలన్ తాషీర్, ఇటలీలో ఉండే ఆంటోనీ లోబో,ఎన్‌సీబీ ఆఫీసర్స్ కోడి పుంజు బొమ్మను అమ్మడం కోసం స్మగ్లర్లతో డీల్ చేయడం వంటి అంశాలతో ఆ తరువాత ఏం జరుగుతుందా? అనే ఇంట్రెస్ట్ ను ఆడియెన్స్ లో కలిగించారు.ఆ బొమ్మ కోసం ఎన్సీబి మాజీ ఆఫీసర్ సదానందం ప్లాన్ వేయడం, దానిని అనుపమ అండ్ టీమ్ అమలు చేయడం ఇంట్రెస్ట్ ను కలిగిస్తాయి.
నటీనటుల పెర్ఫార్మన్స్ విషయానికి వస్తే, ఇంటెలిజెంట్ ఇల్లాలి పాత్రలో ప్రియమణి చక్కగా నటించారు. తొలి పార్ట్ కన్నా ఎక్కువ ఇంటెలిజెన్స్‌తో అనుపమ రోల్ ఇందులో కనిపిస్తుంది. ప్రియమణి ఆ ఛేంజ్‌ను చక్కగా తెరపై చూపించారు. శరణ్య ప్రదీప్ రోల్ కూడా తొలి పార్ట్ కన్నా ఫన్నీగా ఉంది. సీరత్ కపూర్, అనూజ్ గుర్వారా,రుద్ర ప్రదీప్, సందీప్ వేద్, రఘు ముఖర్జీ, తమ పాత్రల మేరకు నటించారు.
ప్లస్ పాయింట్స్ :
- ప్రియమణి యాక్టింగ్,
- ట్విస్టులు,
- సినిమాటోగ్రఫి,
మైనస్ పాయింట్స్:
- కొన్ని చోట్ల ల్యాగ్ ఎక్కువ అవడం,
- ప్రీ క్లైమాక్స్
రేటింగ్ :
2.5/5
watch trailer :
End of Article