పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిన్న తన 50వ జన్మదినాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానులు, అలాగే ఎంతో మంది సెలబ్రిటీలు పవన్ కళ్యాణ్ కి బర్త్ డే విషెస్ అందించారు. అలాగే పవన్ కళ్యాణ్ రాబోయే సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కూడా విడుదల చేస్తున్నారు. ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ తదుపరి సినిమా అయినా భీమ్ల నాయక్ సినిమాలోని టైటిల్ సాంగ్ నిన్న విడుదల చేశారు.

mogulayya bheemla nayak title song

ఈ పాటని తమన్ స్వరపరిచారు. పృథ్వి చంద్ర, శ్రీకృష్ణ, రామ్ మిరియాల పాడారు. ఈ పాటలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తో పాటు సింగర్స్ కూడా కనిపించడం విశేషం.ఈ పాటలో మరొక వ్యక్తి కూడా కనిపిస్తారు. పాట మొదట్లో కిన్నెర వాయిస్తూ ఒక వ్యక్తి కనిపిస్తారు ఆయన పేరు మొగులయ్య. మొగులయ్య నాగర్ కర్నూల్, లింగాల మండలానికి చెందినవారు.

mogulayya bheemla nayak title song

గ్రామ గ్రామానికి తిరుగుతూ కిన్నెర వాయిస్తూ ఆ వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషించేవారు. 12 మెట్ల కిన్నెర వాయించే వాళ్ళు మన రాష్ట్రంలో లేరు. దాంతో మొగులయ్య ని తెలంగాణ ప్రభుత్వం గుర్తించి సత్కరించింది. ఇప్పటికైనా మొగులయ్య కి మంచి గుర్తింపు దొరికింది అని ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలు ఆనంద పడుతున్నారు. ఇంకా టైటిల్ సాంగ్ విషయానికొస్తే విడుదలయిన కొంచెంసేపటికే పాట ట్రెండింగ్ లిస్ట్ లోకి వెళ్లి పోయింది. ఇప్పటికే దాదాపు తొమ్మిది మిలియన్ల మంది ఈ పాట ని చూశారు. పాట లిరికల్ వీడియో చిత్రీకరించిన విధానం కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. దాంతో ఈ పాట సినిమాలో ఎలా ఉండబోతోందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

watch video :