Bheemla Nayak Review : “పవన్ కళ్యాణ్” మళ్లీ బ్లాక్‌బస్టర్‌ కొట్టారా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

Bheemla Nayak Review : “పవన్ కళ్యాణ్” మళ్లీ బ్లాక్‌బస్టర్‌ కొట్టారా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by Mohana Priya

Ads

  • చిత్రం : భీమ్లా నాయక్
  • నటీనటులు : పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి, నిత్యా మీనన్, సంయుక్తా మీనన్, సముద్రఖని, రావు రమేష్.
  • నిర్మాత : సూర్యదేవర నాగ వంశీ
  • దర్శకత్వం : సాగర్ కే చంద్ర
  • సంగీతం : తమన్
  • విడుదల తేదీ : ఫిబ్రవరి 25, 2022

Also Read: Aadavallu Meeku Johaarlu Movie Review and Rating

Video Advertisement

Bheemla nayak Review and rating

Bheemla nayak Review and rating

Bheemla Nayak Story స్టోరీ :

కథ మొత్తం అటవీ ప్రాంతంలో జరుగుతుంది. భీమ్లా నాయక్ (పవన్ కళ్యాణ్) కర్నూల్ జిల్లాలో ఒక సబ్ ఇన్స్పెక్టర్. ఒక సారి డేనియల్ శేఖర్ (రానా దగ్గుబాటి) అనే ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ డ్రై ఏరియాలో మద్యం ఎగుమతి చేస్తున్నప్పుడు భీమ్లా నాయక్ పట్టుకుంటాడు. ఈ కారణంగా డేనియల్ శేఖర్ అహంకారం దెబ్బతింటుంది. దాంతో వారిద్దరి మధ్య గొడవలు మొదలవుతాయి. డేనియల్ శేఖర్ జైలుకి వెళ్తూ వెళ్తూ, బెయిల్ వచ్చిన తర్వాత మళ్లీ భీమ్లా నాయక్ ని కలిసి అప్పుడు తన సంగతి చూస్తాను అని చెప్తాడు. అలాగే బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి భీమ్లా నాయక్‌తో గొడవ పెట్టుకుంటాడు. తర్వాత ఏమైంది? అహంకారం గెలిచిందా? వీళ్ళిద్దరి గొడవ వల్ల వారి కుటుంబాలు ఏమైనా సమస్యలు ఎదుర్కొన్నాయా? అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

reasons behind the negative talk for bheemla nayak trailer

Bheemla Nayak Review& Ratingరివ్యూ :

సినిమా రీమేక్ అనే విషయం తెలిసిందే. కానీ పవన్ కళ్యాణ్ నటిస్తూ ఉండటంతో, అది కూడా రానా దగ్గుబాటితో మల్టీస్టారర్ అవ్వడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ట్రైలర్ విడుదల అయిన తర్వాత రెస్పాన్స్ కూడా అలాగే వచ్చింది. కొంతమంది బాగుంది అంటే మరికొంతమంది మాత్రం ఒరిజినల్ సినిమాకి సంబంధం లేదు అని అన్నారు. కానీ ఈ సినిమా దాదాపు ఒరిజినల్ సినిమా లాగానే ఉంటుంది. స్టొరీ లైన్ పెద్దగా మార్చలేదు. కానీ పవన్ కళ్యాణ్ పాత్రకి తగ్గట్టు కొన్ని ఎలివేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ స్లోగా నడుస్తుంది. రెండు పాత్రల మధ్య గొడవలు చూపించడంతోనే ఫస్ట్ హాఫ్ అంతా అయిపోతుంది. సినిమాకి ప్లస్ పాయింట్, కథ ఎక్కువగా నడిచేది సెకండ్ హాఫ్‌లోనే.

reasons behind the negative talk for bheemla nayak trailer

అసలు ఎక్కువ మార్పులు చేసింది కూడా అందులోనే. చాలా వరకు సెకండ్ హాఫ్ అంతా మాస్ ఎలివేషన్స్ ఉండేలా చూసుకున్నారు. తెరపై కనిపించే హీరోలు పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి అయితే, తెరవెనుక హీరో మాత్రం కచ్చితంగా తమన్. పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ అయ్యాయి. అసలు ఏ సీన్ కి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అవసరమో, ఆ సీన్ కి అలాంటి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు తమన్. ఇంక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్, రానా బాగా నటించారు. వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ తెరపై చూడడానికి కూడా చాలా బాగున్నాయి.

reasons behind the negative talk for bheemla nayak trailer

దర్శకుడు సాగర్ కే చంద్ర ఇద్దరికీ సమానమైన పాత్రలు ఉండేలాగా బాగా డిజైన్ చేశారు. త్రివిక్రమ్ అందించిన మాటలు, స్క్రీన్ ప్లే కూడా బాగున్నాయి. ఒరిజినల్ తో పోలిస్తే హీరోయిన్ నిత్యా మీనన్ కి ఎక్కువ ఆస్కారం ఉన్న పాత్ర ఇచ్చారు. అలాగే మరొక హీరోయిన్ అయిన సంయుక్త మీనన్ పాత్రని ఒరిజినల్ లో లేకపోయినా కూడా తెలుగులో యాడ్ చేశారు. సంయుక్త కూడా తనకు మొదటి తెలుగు సినిమా ఇదే అయినా బాగా నటించారు. అలాగే సహాయ పాత్రల్లో నటించిన సముద్రఖని, రావు రమేష్, మురళీ శర్మ, తనికెళ్ల భరణి కూడా వారి పాత్రల మేరకు బాగానే నటించారు. ఇవి మాత్రమే కాకుండా రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫీ కూడా ఈ సినిమాకి మరో పెద్ద హైలైట్‌గా నిలిచింది. ఫస్ట్ హాఫ్‌లో మాత్రం స్క్రీన్ ప్లే ఇంకా కొంచెం ఫాస్ట్ గా ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్ :

  • నటీనటులు
  • పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్
  • సెకండ్ హాఫ్
  • కొన్ని డైలాగ్స్
  • క్లైమాక్స్
  • యాక్షన్ సీన్స్

మైనస్ పాయింట్స్:

  • కొన్ని మార్పులు
  • పాటల పిక్చరైజేషన్
  • కొంచెం స్లోగా నడిచే ఫస్ట్ హాఫ్

రేటింగ్ :

3.25/2

ట్యాగ్ లైన్ :

ఒరిజినల్ స్టోరీ లైన్ కి కొన్ని కమర్షియల్ అంశాలు యాడ్ చేశారు. ఇవి కూడా సినిమాకి ఒక పాజిటివ్ అయ్యాయి. పవర్ స్టార్ ఫ్యాన్స్ ని, కమర్షియల్ సినిమా ఫ్యాన్స్ ని మాత్రమే కాకుండా మాములు ఆడియన్స్ ని కూడా భీమ్లా నాయక్ ఖచ్చితంగా నిరాశ పరచదు.

Also Read: Bheemla Nayak Dialogues


End of Article

You may also like