BHIMAA vs GAAMI: ఒకే రోజు విడుదలైన ఈ రెండు సినిమాల్లో ఏది బాగుంది? ఎవరిది పైచేయి.?

BHIMAA vs GAAMI: ఒకే రోజు విడుదలైన ఈ రెండు సినిమాల్లో ఏది బాగుంది? ఎవరిది పైచేయి.?

by Harika

Ads

మార్చి 8న మహాశివరాత్రి సందర్భంగా చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి కానీ గట్టి పోటీ మాత్రం గోపీచంద్ భీమా,విశ్వక్ సేన్ సినిమా గామి మధ్యనే ఉంది. ఈ ఇద్దరిలో బాక్స్ ఆఫీస్ విన్నర్ గా కంబ్యాక్ ఇచ్చే హీరో ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. ప్రమోషనల్ కంటెంట్ కారణంగా ఆడియన్స్ లో ఈ రెండు సినిమాలపై మంచి క్యూరియాసిటీ ఏర్పడింది.

Video Advertisement

bhimaa movie review

ప్రస్తుతం గోపీచంద్, విశ్వక్ సేన్ ఉన్న పరిస్థితులలో ఇద్దరికీ హిట్ చాలా అవసరం. 2021 లో రిలీజ్ అయిన సిటీమార్ సినిమా తరువాత గోపీచంద్ కి ఒక్క హిట్ కూడా పడలేదు.ఇక భీమా సినిమా విషయానికి వస్తే డివోషనల్ బ్యాక్ డ్రాప్లో యాక్షన్ ఎంటర్టైనర్ గా దర్శకుడు ఏ.హర్ష ఈ మూవీ ని తెరకెక్కించాడు. అందులో ఒక టెంపుల్ని కాపాడే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో గోపీచంద్ కనిపిస్తాడు.

ఇక విశ్వక్ సేన్ కి కూడా అశోకవనంలో అర్జున కళ్యాణం, దాస్ కా ధంకి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ ని సొంతం చేసుకోలేకపోయాయి. ఆ డిజాస్టర్స్ నుంచి బయటికి రావాలంటే ఖచ్చితంగా గామి సినిమా హిట్ అవ్వాలి. ఈ సినిమా కోసం దర్శకుడు విద్యాధర్, హీరో విశ్వక్ సేన్ ఆరు సంవత్సరాలు కష్టపడ్డారు. అన్ని సంవత్సరాలు కష్టపడినందుకు ఈ సినిమా విజువల్ వండర్ గా తెరకెక్కింది.

gaami movie review

చిత్ర బృందం ప్రతి ఒక ఎలిమెంట్ మీద పెట్టిన శ్రద్ధ ఆడియన్స్ తో విజిల్స్ వేయిస్తుంది. అలాగని ఇందులో మాస్ డైలాగ్స్, ఎలివేషన్స్, యాక్షన్ సీక్వెన్స్ లు ఉంటాయి అనుకుంటే పొరపాటే. చాందిని చౌదరి ఈ సినిమా కోసం పడిన కష్టం అంతా సినిమాలో కనిపిస్తుంది. అయితే ఈ రెండు సినిమాలని కంపేర్ చేస్తే మాత్రం గామి సినిమా యే ఒక మెట్టు పైన ఉంది. రెండు సినిమాలని కంపేర్ చేయకుండా చూస్తే ఏ సినిమాకి ఆ సినిమా యే హైలెట్ అని చెప్పాలి.


End of Article

You may also like