Ads
బిగ్ బాస్ 5 తెలుగు రియాలిటీ షో నుంచి తాజాగా అనీ మాస్టర్ ఎలిమినేట్ అయిపోయారు. దాదాపు 11 వారాలుగా హౌస్ లో ఆడుతున్న అనీ మాస్టర్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్నారు. అయితే.. అనూహ్యంగా నిన్నటి ఎపిసోడ్ లో ఆమె ఎలిమినేట్ అయ్యారు.
Video Advertisement
నిజానికి అనీ మాస్టర్ స్ట్రాంగ్ ప్లేయర్. ఇప్పటివరకు తనకోసమే గట్టిగా ఆటని ఆడారు. మరో కంటెస్టెంట్ ప్రియాంక మానస్ పై ఫోకస్ చేస్తూ గేమ్ ను పక్కదారి పట్టించేస్తోంది. ఈ విషయమై విమర్శలు కూడా ఎదుర్కుంటోంది.
అయితే.. ప్రియాంక కంటే అనీ మాస్టర్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయినప్పటికీ.. ఆమె ఎలిమినేట్ అవడం పై రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. ఆమె సాధ్యమైనంతవరకు తక్కువే మాట్లాడుతారు. కానీ.. తనకు అనుకూలత ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం ఎక్కువగా నోరు పారేసుకుంటూ ఉంటారు. ఆ టైములో ఎవరిని లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం వలన కూడా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. అందుకే ఆమె ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చిందని టాక్ వినిపిస్తోంది.
End of Article