ఈ యాంకర్ రెండు సార్లు పెళ్లి చేసుకుందని మీకు తెలుసా.?

ఈ యాంకర్ రెండు సార్లు పెళ్లి చేసుకుందని మీకు తెలుసా.?

by Anudeep

Ads

దాదాపు 3 నెలలపాటు సాగిన బిగ్ బాస్ తెలుగు సీజన్-5 ఇటీవల ముగిసింది. 20 మందితో మొదలైన ఈ ప్రోగ్రామ్‌లో సన్నీవిజేతగా నిలిచారు. ఫినాలే ఎపిసోడ్ సందర్భంగా ఎంతో మంది స్టార్స్ అతిథులుగా వచ్చారు. ఇదిలా ఉండగా బిగ్ బాస్ 6వ సీజన్ మొదలవుతుంది అని నాగార్జున ముందే చెప్పారు. చెప్పినట్టే ఈ సీజన్ ఫిబ్రవరిలో మొదలవ్వబోతోంది. అయితే బిగ్ బాస్ టీవీలో కాకుండా ఓటీటీలో టెలికాస్ట్ అవుతుంది. అలాగే వీరిలో గత సీజన్స్ లో పాల్గొన్న కంటెస్టెంట్స్ కూడా ఉంటారు.

Video Advertisement

 

ఫిబ్రవరి 26 వ తేదీ నుంచి ఓటిటిలో ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తిరిగి బిగ్ బాస్ హడావిడి మొదలైంది. ఇప్పటికే ఎవరెవరు ఈ షోలో పాల్గొనబోతున్నారో కూడా తెలిసిపోయింది.

sravanthi

ఈసారి షో లో యాంకర్‌ స్రవంతి చొక్కారపు కూడా ఐదవ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చారు. ఆమె రాయలసీమలో కదిరి గ్రామం నుంచి వచ్చారు. సోషల్ మీడియాలో పాపులర్ అయిన స్రవంతి టివిలో యాంకర్ గా చేస్తున్నారు. తాజాగా ఆమె ఎంట్రీ ఇస్తూ తన స్మైల్ గురించి మాట్లాడింది. తన స్మైల్ గురించే రోజుకో వంద కామెంట్స్ వస్తాయని చెప్పుకొచ్చింది.

sravanthi 1

ఇక బాడీ షేమింగ్ చేసే వారు కూడా ఉంటారని.. అటువంటి కామెంట్లు కూడా వస్తాయని ఆమె చెప్పుకొచ్చింది. ఇక తన లైఫ్ గురించి చెపుతూ తాను రెండు సార్లు పెళ్లి చేసుకున్నానని చెప్పుకొచ్చింది. మొదటి సారి ప్రేమ వివాహం చేసుకున్నానని.. ఆ తరువాత పెద్దల సమక్షంలో రెండోసారి చేసుకున్నానని అసలు విషయం చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ ఓటిటి లో ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేస్తానని మాటిచ్చింది. మరి ఆమె తన మాటని ఎంతవరకు నిలబెట్టుకుంటుందో చూడాలి.


End of Article

You may also like