Ads
ఎట్టకేలకు ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 మొదలయ్యింది. సాధారణంగా అయితే ఈ ప్రోగ్రాంలో సినీ రంగానికి చెందిన సెలబ్రిటీలని మాత్రమే ఎక్కువగా తీసుకుంటారు. కానీ ఈసారి మాత్రం సినిమా రంగానికి చెందిన ప్రముఖులతోపాటు సోషల్ మీడియాకు చెందిన ప్రముఖులను కూడా తీసుకున్నారు. అంతే కాకుండా సీరియల్ నటులు కూడా ఇందులో కంటెస్టెంట్స్ గా పాల్గొంటున్నారు. మనకి నచ్చిన సెలెబ్రిటీ నిజ జీవితంలో ఎలా ఉంటారో తెలుసుకోవాలనే ఆసక్తి మనలో చాలా మందికి ఉంటుంది. అందుకే ఈ ప్రోగ్రాంకి అంత క్రేజ్ ఉంది. ఈసారి బిగ్ బాస్ తెలుగు-5 కంటెస్టెంట్స్ గా హౌస్ లోకి అడుగు పెట్టిన వారిలో విజె సన్నీ కూడా ఉన్నారు.
Video Advertisement
కల్యాణ వైభోగం సీరియల్ లో నటుడి గా విజె సన్నీ అందరికి సుపరిచితుడైన నటుడే.. జయసూర్య అనే పాత్రలో ఆయన నటించారు. ఈ సీరియల్ లో మేఘన లోకేష్ హీరోయిన్ గా నటించారు. 1989 లో జన్మించిన సన్నీ, ఖమ్మం లో పాఠశాల చదువు పూర్తి చేసారు. ఆ తరువాత హైదరాబాద్ ఉస్మానియా లో బికాం చదివారు. తల్లి ప్రోత్సాహం తో చిన్నతనం నుంచే నాటకాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. చిన్న వయసులోనే “అల్లాఉద్దీన్ ” నాటకం లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.
ఆ తరువాత నటన పై ఆసక్తి కారణం గా ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ‘జస్ట్ ఫర్ మెన్’ అనే టీవీ షో కి కూడా సన్నీ యాంకర్ గా చేశారు. ఓ న్యూస్ ఛానల్ లో లైఫ్ స్టయిల్ రిపోర్టర్ గా పని చేసిన సన్నీ ఆ తరువాత వీజే గా కూడా పని చేసారు. బిగ్ బాస్ లో అవకాశం రావడం తో తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకోడానికి సన్నీ కి అవకాశం దొరికింది. అయితే.. సన్నీ వెండితెరపై కూడా అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
‘సకలగుణాభి రామా’ అనే సినిమా లో సన్నీ నటించారు. ఇటీవలే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితా లో సన్నీ పేరు కూడా ఉంది. అలా.. ఆయన మూడు సార్లు ఆ లిస్ట్ లో చోటు దక్కించుకున్నారు.
End of Article