బిగ్ బాస్4: యూట్యూబర్ అలేఖ్య హారిక నటించిన ఆ ఒకే ఒక్క సినిమా ఏంటో తెలుసా?

బిగ్ బాస్4: యూట్యూబర్ అలేఖ్య హారిక నటించిన ఆ ఒకే ఒక్క సినిమా ఏంటో తెలుసా?

by Mohana Priya

Ads

రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ ఫోర్ ఎట్టకేలకు ప్రారంభమైంది. ఈ సీజన్ కి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇంక కంటెస్టెంట్స్ విషయానికొస్తే సోషల్ మీడియాలో ఎంతోకాలం నుండి ఎన్నో పేర్లు వైరల్ అయ్యాయి. అలా వైరల్ అయిన లిస్టులో ఉన్న కంటెస్టెంట్స్ లో కొంతమంది నిజంగానే బిగ్ బాస్ లో ఉన్నారు. అలాగే ముందుగా ఎంపిక చేసుకున్న బిగ్ బాస్ కంటెస్టెంట్ల లో కొంతమందికి కరోనా పాజిటివ్ రావడంతో చివరి నిమిషంలో వాళ్లని వేరే కంటెస్టెంట్స్ రీప్లేస్ చేశారు అనే వార్త కూడా ప్రచారం అవుతోంది.

Video Advertisement

బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లిస్ట్ లో మొదటి నుండి స్ట్రాంగ్ గా వినిపించిన పేరు అలేఖ్య హారిక. యూట్యూబ్ లో దేత్తడి ఛానల్ తో మనందరికీ పరిచయమయ్యారు అలేఖ్య హారిక. ఆ ఛానల్ లో సాధారణంగా మనం రోజూ జీవితంలో ఎదుర్కొనే సమస్యలను సరదాగా చూపిస్తూ ఎంతో పాపులర్ అయ్యారు హారిక. సెటైరికల్ గా అందర్నీ నవ్వించేలా ఉండే ఈ వీడియోస్ ద్వారా ఎంతోమందికి చేరువయ్యారు.

 

అలేఖ్య హారిక యూట్యూబ్ లో మాత్రమే కాకుండా సినిమాల్లో కూడా కనిపించారు. కానీ తెలుగు సినిమా లో కాదు. మూడేళ్ల క్రితం విడుదలైన అర్జున్ రెడ్డి తర్వాత హిందీలో కబీర్ సింగ్ గా, తమిళ్ లో ఆదిత్య వర్మ గా రీమేక్ అయింది.

 

తమిళ్ లో హీరో విక్రమ్ కొడుకు ధృవ్ విక్రమ్ ఆదిత్య వర్మ సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. ఈ సినిమాలో బనితా సంధు హీరోయిన్ గా నటించారు. అర్జున్ రెడ్డి  డాక్టర్ అయిన తర్వాత హాస్పిటల్ లో ఇద్దరు నర్స్ లు అర్జున్ రెడ్డి కి అసిస్ట్ చేస్తారు. గుర్తుందా? ఆ ఇద్దరూ నర్స్ లలో ఒక నర్స్ పాత్రను తెలుగులో లహరీ షారీ పోషించగా, తమిళ్ లో ఆ పాత్ర లో అలేఖ్య హారిక కనిపించారు.

 

అలా అలేఖ్య హారిక తెలుగులోనే కాకుండా తమిళ్ లో కూడా పరిచయమయ్యారు. బిగ్ బాస్ షో విషయానికి వస్తే ఈ వారం ఎలిమినేషన్ మొదలవుతుంది. ఎలిమినేషన్ ప్రక్రియ తో పాటు కంటెస్టెంట్స్ కి టాస్క్ లు, ఇంకా ప్రేక్షకుల ఓటింగ్ కూడా మొదలవుతాయి.


End of Article

You may also like