మెగాస్టార్ చిరంజీవి బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య చిత్రం లో నటిస్తున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత సూపర్ స్పీడ్ తో దూసుకు పోతున్నారు చిరు. ఎప్పుడు లేనంత స్పీడ్ తో సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత సినిమాలతో బిజీ అయ్యిపోయారు. పైగా మాస లుక్ లో చిరు అందరినీ అకట్టేసుకుంటున్నారు. మాస్ మహారాజ్ రవితేజ కూడా చిరు తో పాటుగా నటిస్తున్నారు.

Video Advertisement

దీనితో చిరు ఫ్యాన్స్ రవి తేజ ఫ్యాన్స్ కూడా ఎక్సయిట్ అవుతున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా ఈ సినిమా లో చేస్తోంది. ఈ సంక్రాతి కి వాల్తేరు వీరయ్య చిత్రం విడుదల అవ్వనుంది.

waltair veerayya censor talk..

ఈ సినిమా ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి పాటలు రిలీజ్ అయ్యాయి. అవి అందరినీ బాగా అకట్టేసుకున్నాయి. ‘బాస్ పార్టీ’ కి అయితే సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అలానే పూనకాలు లోడింగ్ అనే పాట కూడా ఈ మూవీ నుండి వచ్చింది. ఈ సాంగ్ లో రవి తేజ, చిరంజీవి కలిసి స్టెప్పులేశారు. అందరికీ తెగ నచ్చేస్తోంది. సంధ్య 70 ఎంఎంలో గ్రాండ్ గా పూనకాలు లోడింగ్ పాట ని రిలీజ్ చేసారు.

ఈ పాట క్లాస్, మాస్ ప్రేక్షకులకు పూనకాలను తెప్పించింది. దేవి శ్రీ ప్రసాద్ అందరికీ పూనకాలు తెప్పించాలని ప్లాన్ చేసుకుని ఈ పాట ని తీసుకు వచ్చాడేమో అన్నట్టు వుంది. అందుకే ఇలా అవుట్ స్టాండింగ్ గా కంపోజ్ చేసాడు దేవి. చిరు, రవితేజ డాన్స్ కూడా హైలైట్ గా వుంది. ఇక ఈ పాట లిరికల్‌ వీడియో లో చూస్తే దేవి శ్రీ ప్రసాద్ ఓ బూర లాంటి ఇన్‌స్ట్రూమెంట్‌ను ఉపయోగించారు. దీనిని దేవి శ్రీ ప్రసాద్ గోవా నుండి తీసుకు వచ్చారట. ఈ హిట్‌ పాటకు మెయిన్‌ ట్యూన్‌ ఇచ్చిన ఆ బూర ధర ఎంతో తెలుసా..? కేవలం రూ. 250.