LAMBASINGI REVIEW: బిగ్ బాస్ ఫేమ్ “దివి” నటించిన “లంబసింగి” సినిమా ఎలా ఉంది.? స్టోరీ, రివ్యూ & రేటింగ్!!

LAMBASINGI REVIEW: బిగ్ బాస్ ఫేమ్ “దివి” నటించిన “లంబసింగి” సినిమా ఎలా ఉంది.? స్టోరీ, రివ్యూ & రేటింగ్!!

by Harika

Ads

బిగ్‌బాస్ ఫేమ్ ‘దివి’ నటించిన ‘లంబసింగి’ సినిమా ఈ రోజు ఆడియన్స్ ముందుకి వచ్చింది. నవీన్ గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ చూసేద్దాం.

Video Advertisement

సినిమా: లంబసింగి
నటీనటులు: దివి వద్యా, జై భారత్ రాజ్, వంశీ రాజు, కిట్టయ్య, నిఖిల్ రాజ్ తదితరులు
దర్శకుడు: నవీన్ గాంధీ
నిర్మాత: ఆనంద్.టి
సంగీతం: ఆర్ఆర్.ధ్రువన్
ఎడిటర్: విజయ్ వర్ధన్ కావూరి
సినిమాటోగ్రఫి: కే.బుజ్జి
విడుదల తేదీ: మార్చి 15, 2024

కథ:

వీరబాబు(భరత్ రాజ్) కి లంబసింగి లో కానిస్టేబుల్ గా పోస్టింగ్ వస్తుంది. అదే ఊరిలో ప్రభుత్వ ఆసుపత్రిలో న‌ర్సుగా చేసే హరిత(దివి) ని చూసి తొలిచూపులోనే ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఆ ఊరిలో నక్సలైట్లు గా ఉన్న చాలా మందికి ప్రభుత్వం పునరావాసం ఇస్తుంది. అందులో కోన‌ప్ప అనే న‌క్స‌-లైట్ లీడ‌ర్ కూడా ఉంటారు. ఆతను హరితకి తండ్రి. అలాంటి వారితో పోలీసులు రోజూ సంతకాలు పెట్టించుకుని గమనిస్తూ ఉండాలి. ఈ పని వీరబాబుకి అప్పగిస్తారు. హరితని ప్రేమలో పడేయడానికి రోజూ ఆమె తండ్రి తో సంతకం పెట్టించేందుకు వెళ్తాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తిని కాపాడే క్రమంలో నర్సుగా పనిచేసే హరితకి మరింత దగ్గరవుతాడు.

హ‌రిత‌కు త‌న ప్రేమ‌ను ప్ర‌పోజ్ చేస్తాడు వీర‌బాబు.కానీ ఆమె ఒప్పుకోదు. ఒక రోజు అతను మాత్రమే పోలీస్ స్టేషన్లో డ్యూటీలో ఉంటాడు. కొందరు నక్స-లైట్లు దాడి చేసి అక్కడ ఉన్న అక్రమ ఆయుధాలను తీసికెళ్తారు. గాయపడిన వీరబాబుకి ఊహించని షాక్ ఎదురవుతుంది. ఆ ద‌ళం స‌భ్యుల్లో కోన‌ప్ప‌తో పాటు హ‌రిత కూడా ఉంటుంది. అసలు హరిత తన ప్రేమని ఎందుకు రిజెక్ట్ చేసింది..? ఆమె గతం ఏంటి..? తెలుసుకోవాలంటే మూవీ చూడాలి.

రివ్యూ:

ప్రేమకథ సినిమాలు ఎన్నో వచ్చాయి…కానీ ఒక లేడీ నక్సలైట్ కి, ఒక పోలీస్ కానిస్టేబుల్ కి మధ్య లవ్ స్టోరీతో సినిమా తీయడం స్పెషల్ గా ఉంది. దర్శకుడు నవీన్ గాంధీ ఎంపిక చేసుకున్న ఈ కథ చాలా బాగుంది. హీరోయిన్ ట్రాక్ ని దర్శకుడు తెరకెక్కిచిన విధానం బాగుంది. ఫస్ట్ హాఫ్ స్లోగా ఉన్నపటికీ తర్వాత స్పీడ్ గా నడుస్తుంది కథ. ఇంటర్వెల్ బ్లాక్ ట్విస్ట్ ఈ సినిమాకి హైలైట్. స్క్రీన్ ప్లే బాగుంది.

వీరబాబు, రాజు కామెడీ అదిరిపోయింది. క్లైమాక్స్ అయితే చాలా ఎమోషనల్ గా ఉంటుంది. ఆడియన్స్ ఆ ఎమోషన్ కి బాగా కనెక్ట్ అవుతారు. థియేటర్ నుండి బయటకి వచ్చే ప్రేక్షకుడు ఆ ఫీల్ ను క్యారీ చేస్తూ వచ్చేలాగా చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు. ఆర్.ఆర్.ధృవన్ అందించిన సంగీతం మూవీ కి పెద్ద ప్లస్ అయింది. ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ దివి నటన. హరిత పాత్రలో ఆమె ఒదిగిపోయింది. అలానే హీరో భరత్ కూడా వీరబాబు అనే పాత్ర లో చాలా నేచురల్ గా యాక్ట్ చేసాడు.

ప్లస్ పాయింట్స్:

  • కథ
  • హీరోయిన్ రోల్
  • ఇంటర్వెల్ ట్విస్ట్
  • క్లైమాక్స్ లో ఎమోషన్
  • కెమెరా విజువల్స్
  • సంగీతం

మైనస్ పాయింట్స్:

  • అక్కడక్కడా బోరింగ్ సన్నివేశాలు

రేటింగ్: 3/5

ట్యాగ్ లైన్ :

ఓ పోలీస్ కానిస్టేబుల్, లేడీ నక్సలైట్ మధ్య జరిగే ప్రేమ కథ “లంబసింగి”. సరదాగా సాగుతూనే ట్విస్టులు ఎమోషన్స్ తో ఆడియన్స్ కి ఓ డిఫ‌రెంట్ ఫీలింగ్‌ను క‌లిగిస్తుంది. బిగ్‌బాస్ దివి కోసం ఈ వీకెండ్ కి థియేటర్లలో ట్రై చేయదగ్గ సినిమా.

watch trailer:

 


End of Article

You may also like