Ads
బిగ్ బాస్ రియాలిటీ షో మొదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో బిగ్ బాస్ కి సంబంధించిన సందడి ఎక్కువగానే ఉంటోంది. ఆ హౌస్ లో జరుగుతున్న ముచ్చట్ల గురించి కొందరు ట్రోల్స్ చేస్తుంటే.. మరికొందరు సస్పెన్స్ రేకెత్తించేలా కథనాలను అల్లేస్తున్నారు.
Video Advertisement
తాజాగా బిగ్ బాస్ షో ముగియడం తో ఈ కథనాలకు తెరపడింది. అయితే.. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన కంటెస్టెంట్స్ వరుసగా ఇంటర్వ్యూ లు ఇచ్చేస్తున్నారు.
తాజాగా.. సిరి హనుమంత్ కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆమెను మాజీ కంటెస్టెంట్, యాంకర్ అరియనా ఇంటర్వ్యూ చేసారు. ఆమె ఇంటర్వ్యూ లో షన్ను గురించి పలు ప్రశ్నలు అడిగారు. చివరకు శ్రీహన్ ప్రేమ కావాలా..? లేక షన్ను ఫ్రెండ్షిప్ కావాలా..? అంటూ అడిగింది. దానికి సిరి.. శ్రీహన్ తన లైఫ్ పార్టనర్ అని.. తనకి శ్రీహన్ ప్రేమే కావాలని చెప్పుకొచ్చింది. అలా అని షన్ను వద్దని కాదు.. లేట్ గా నా లైఫ్ లోకి వచ్చినా.. నాకు షన్ను ఫ్రెండ్ షిప్ కూడా కావాలి అని తెలివిగా ఆన్సర్ ఇచ్చింది.
End of Article