బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫోర్ మొదటి వారం కొంచెం ఎంటర్టైన్మెంట్ తో, కొంచెం ఎమోషన్స్ తో, కొన్ని గొడవలతో గడిచింది. కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ సీజన్ లో  మోనాల్ గజ్జర్, అభిజిత్, మెహబూబ్, అఖిల్ సార్థక్, గంగవ్వ, సయ్యద్ సోహెల్ రయాన్, కరాటే కళ్యాణి, అరియానా గ్లోరీ, లాస్య, దివి, అలేఖ్య హారిక, నోయల్, జోర్దార్ సుజాత, అమ్మ రాజశేఖర్, దేవి నాగవల్లి, సూర్య కిరణ్ కంటెస్టెంట్స్ గా పాల్గొంటున్నారు. మొదటి వీక్ నామినేషన్ లో సూర్యకిరణ్ ఎలిమినేట్ అయ్యారు. అంతేకాకుండా ఈ రోజుల్లో, బస్టాప్, బ్రాండ్ బాబు సినిమాల్లో నటించిన కుమార్ సాయి బిగ్ బాస్ లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చారు.

Bigg Boss 4 Telugu kumar sai

Bigg Boss 4 Telugu kumar sai

ఇప్పుడు బిగ్ బాస్ సరికొత్త ప్రోమో విడుదలైంది. హౌస్ లోకి ఎంటర్ అయ్యి ఒక్కరోజు కూడా కాకముందే ఫన్ మొదలెట్టేసాడు చూడండి.

watch video:

Wild card entry #KumarSai house enter ayyadu…Housemates kosam ee surprise ela untundi? Catch #BiggBossTelugu4 tonight on #DisneyPlusHotstar #WhatAWowWow https://bit.ly/2ZoOdRf

Posted by Disney+ Hotstar on Monday, September 14, 2020

వీకెండ్ ఎపిసోడ్ లో బిగ్ బాస్ హోస్ట్ కింగ్ నాగార్జున అందరినీ అలరించారు. శనివారం రోజు కంటెస్టెంట్స్ చేస్తున్న పొరపాట్లు చెప్పిన నాగార్జున, ఆదివారం రోజు అందరికీ డాన్స్ చేసే టాస్క్ ఇచ్చారు. కంటెస్టెంట్స్ అందరూ ఇద్దరు ఇద్దరుగా వచ్చి ఒక్కొక్కరు గార్డెన్ ఏరియా లో ఏర్పాటు చేసిన ఒక్కొక్క స్టేజ్ మీద నిలబడి డాన్స్ వేశారు.

అలాగే ఒకరు పేపర్ పై రాసి ఉన్న రైమ్స్, పద్యాలను చదివి బోర్డు మీద బొమ్మల రూపంలో వాళ్ళు చదివిన వాటిని ప్రజెంట్ చేస్తే ఇంకొకరు అది ఏంటో చెప్పారు. తర్వాత ఎలిమినేషన్ ప్రక్రియ జరిగింది. చివరికి దివి, సూర్య కిరణ్ మిగలగా సూర్యకిరణ్ ఎలిమినేట్ అయ్యారు.

also watch: