Ads
బిగ్ బాస్ ప్రోగ్రాం తమిళ్ లో కూడా ప్రసారం అవుతుంది. 18 మంది కంటెస్టెంట్స్ తో 5వ సీజన్ అక్టోబర్ 3వ తేదీన మొదలయ్యింది. ఈ ప్రోగ్రాంలో ట్రాన్స్‌జెండర్ అయిన నమిత మారిముత్తు పాల్గొంటున్నారు. నమిత మోడల్, అలాగే నటి. మిస్ ట్రాన్స్ స్టార్ ఇంటర్నేషనల్ 2020 విన్నర్ అయ్యారు నమిత. ఇటీవల జరిగిన టాస్క్ లో భాగంగా హౌస్‌మేట్స్ ఒక్కొక్కరు వారి కథని చెప్పారు. ఇందులో భాగంగానే నమిత కూడా తన బాధని చెప్పారు.
Video Advertisement
గుక్క తిప్పుకోకుండా మాట్లాడిన నమిత, మధ్యలో చాలా ఎమోషనల్ కూడా అయ్యారు. నమిత మాత్రమే కాదు పక్కన ఉన్న కంటెస్టెంట్స్ ని. అలాగే చూస్తున్న ప్రేక్షకులని కూడా నమిత కథ కదిలించింది. సమాజం తనను అంగీకరించకపోవడం, శారీరకంగా, మానసికంగా తాను ఎదుర్కొన్న ఇబ్బందులు గురించి నమిత మాట్లాడారు. మమ్మల్ని ఎందుకు అంగీకరించడం లేదు? మాకు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వడం లేదు? ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి?”
“మానసికంగా, శారీరకంగా మమ్మల్ని చంపేస్తున్నారు. అందుకే రోడ్లమీద అడుక్కుంటూ బతకాల్సివస్తోంది” అని ఎమోషనల్ అయ్యారు నమిత. మమ్మల్ని మనుషుల్లాగే చూడట్లేదు అని మాట్లాడారు. అంతే కాకుండా కొంత మంది వల్ల తనలాంటి వారికి చెడ్డ పేరు వస్తుంది అని, అలాంటి ప్రచారం చేసే వాళ్ళతో పాటు, సంఘంలోని అందరిలోనూ తమపట్ల మార్పులు రావాలి అని, అందరూ కూడా తనలాగ రాణిస్తే చాలా సంతోషిస్తాను” అని నమిత అన్నారు.
సాధారణంగా టీవీలో టెలికాస్ట్ చేసేటప్పుడు ఎడిటింగ్ లో చాలా వరకు కట్ అవుతుంది. కానీ విజయ్ టెలివిజన్ లో టెలికాస్ట్ అయిన ఈ ప్రోగ్రాంలో మాత్రం ఈ ఎపిసోడ్ లో ఎటువంటి కట్స్ లేకుండా, నమిత చెప్పిన చిన్న వాక్యాన్ని కూడా కట్ చేయకుండా, ఏ పదం కూడా బీప్ చేయకుండా ప్రసారం చేశారు. నమిత దాదాపు అరగంట మాట్లాడారు. నమిత కథని చూసిన ఎంతో మంది నెటిజన్లు నమితకి మద్దతు తెలియజేస్తూ పోస్ట్ లు చేస్తున్నారు.
End of Article