బిగ్ బాస్ తెలుగులో ఆరు సీజన్లు పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఏడవ సీజన్ రాబోతుంది. ఏడవ సీజన్ గురించి బిగ్ బాస్ ఫ్యాన్స్ అంతా కూడా ఎదురు చూస్తున్నారు. బిగ్ బాస్ తో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఇప్పటికే చాలా మంది బిగ్ బాస్ ఇంటికి వచ్చి ఎంత గానో అలరించారు. ప్రతి ఏడాది కూడా స్టార్ మా సరికొత్త సీజన్ ని ప్రారంభిస్తుంది. ఆరు సీజన్ల ఎంటర్టైన్మెంట్ ని మీరు చూశారు ఇక ఇప్పుడు ఏడవ సీజన్ మొదలు కాబోతోంది.

Video Advertisement

ఆరు సీజన్స్ లో ఐదు సీజన్స్ టిఆర్పి రేటింగ్స్ ని విపరీతంగా పెంచేసాయి. కానీ సిక్స్త్ సీజన్ మాత్రం పెద్దగా ఆకట్టుకోలేదు. డిసప్పాయింట్ చేసింది.

కంటెస్టెంట్స్ విషయంలో ఆరవ సీజన్ లో పొరపాట్లు చేశారు. పరిచయం లేని వాళ్ళని తీసుకువచ్చి బిగ్ బాస్ హౌస్ లో పెట్టారు. టాస్కుల విషయంలో కూడా కంటెస్టెంట్స్ వెనక్కి పడిపోవడంతో టీఆర్పీ కూడా వెనక్కి పడిపోయింది. మొదట్లోనే టీఆర్ఫీ రేటింగ్ తగ్గిపోయింది తర్వాత మళ్ళీ పెరగలేదు అలానే ఉండిపోయింది. తర్వాత షో ని పైకి తీసుకురావాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ కుదరలేదు. డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలిపోయింది. ఇక ఇప్పుడు ఏడవ సీజన్ వంతు. మరి ఏడవ సీజన్ అందర్నీ ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. అయితే ఏడవ సీజన్ లో జాగ్రత్తలు తీసుకోవాలని చూస్తున్నారు.

unstopable-nbk-2-telugu-adda

హోస్ట్ మొదలు కంటెస్టెంట్ దాకా ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా చూడాలని అనుకుంటున్నారు. ఈసారి నాగార్జున హోస్ట్ గా వుండరు. నాగార్జున ప్లేస్ లో బాలకృష్ణ రాబోతున్నారు. బాలకృష్ణ అన్ స్టాప్ ఫుల్ విత్ NBK లో హోస్ట్ గా ఇప్పటికే వ్యవహరిస్తున్నారు. ఇంకో విషయం ఏమిటంటే గత సీజన్స్ లో పాల్గొన్న వాళ్లు ఇప్పుడు రాబోయే సీజన్లో ఆడబోతున్నట్లు తెలుస్తోంది. కౌశల్, అమర్ దీప్ వంటి వారు కూడా రావచ్చు. యాంకర్ అనసూయ ని కూడా బిగ్ బాస్ హౌస్ కి రమ్మని సంప్రదిస్తున్నారు. మరి ఏడవ సీజన్ అందర్నీ బాగా ఆకట్టుకుంటుందా ఎవరు వస్తారు అనేవి తెలియాలంటే ఎదురు చూడక తప్పదు.