ఐదవ వారం పూర్తి చేసుకుంది బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫోర్. ఈ సీజన్ లో టాస్క్ లతో పాటు గొడవలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఈ విషయంపై నాగార్జున కూడా ప్రతివారం మాట్లాడుతున్నారు. శనివారం ఎపిసోడ్ లో కూడా అలాగే ఈ వారంలో జరిగిన నామినేషన్స్ ప్రక్రియపై, అందులో అయిన చర్చపై సీరియస్ అయ్యారు నాగార్జున. ఇంకొకసారి ఇలాంటివి రిపీట్ అవ్వద్దు అని కొంచెం గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు.

ఒకసారి ఈ వారం మొత్తం జరిగిన ఎపిసోడ్స్ చూసుకుంటే నామినేషన్స్ ఎపిసోడ్, హోటల్ ఎపిసోడ్స్ ఎక్కువ డిస్కషన్ లో ఉన్నాయి. మంగళవారం హోటల్ టాస్క్ జరిగింది. అందులో అరియానా ప్రిన్సెస్ లాగా, గంగవ్వ అరియానా కి తల్లి లాగా, అభిజిత్ హోటల్ ఉద్యోగి లాగా, అలాగే మిగిలిన కంటెస్టెంట్స్ కూడా వేరే వేరే గెటప్స్ వేశారు.

గెస్ట్ టీం లో ఉన్న హారిక చేతి లో నుండి అభిజిత్ స్టార్స్ తీసుకున్నారు అని, బిగ్ బాస్ జడ్జిమెంట్ ఇదే అయితే హోటల్ టీం వాళ్లకి సమాధానం చెప్పాల్సి వస్తుంది అని బాధపడ్డారు హారిక. తర్వాత ఫైవ్ స్టార్స్ ఇచ్చే విషయంలో గెస్ట్ టీం లో ఉన్న హారిక కి, హోటల్ టీం లో ఉన్న అభిజిత్ కి మధ్య కొంచెం సేపు ఆర్గ్యుమెంట్ నడిచింది.

చివరికి బిగ్ బాస్ గెస్ట్ టీం ని విన్నర్ గా డిక్లేర్ చేసారు. తర్వాత హారిక ఇంకా అభిజిత్ హగ్ చేసుకోవడం, బాగా ఆడావని ఒకరినొకరు అభినందించుకోవడం. ఇదంతా బిగ్ బాస్ కెమెరా దృష్టిలో పడింది. అయితే అభినందించుకోవడం ఇలానా.? ఫామిలీస్ చూస్తున్నాయి అని మరిచిపోయారనుకుంటా.? అంటూ ఆడియన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.