ఏంటి నాగార్జున గారు…అలా అబద్దం చెప్పేసారు.? ఇలా బుక్ అయిపోయారు ఏంటి

ఏంటి నాగార్జున గారు…అలా అబద్దం చెప్పేసారు.? ఇలా బుక్ అయిపోయారు ఏంటి

by Mohana Priya

సాధారణంగా బిగ్ బాస్ ప్రోగ్రాం కి టిఆర్పీ మామూలుగా ఉండదు. అసలు ఒక సగటు ప్రేక్షకుడిని ఎట్రాక్ట్ చేయడానికి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉంటాయి. గొడవలు, ఎంటర్టైన్మెంట్, వీకెండ్ లో కింగ్ నాగార్జున హోస్టింగ్, మనకి బాగా తెలిసిన సెలబ్రిటీలు నిజ జీవితంలో ఎలా ఉంటారో చూపించడం, ఇలా ఒకటి కాదు ఎక్కువ మంది బిగ్ బాస్ చూడటానికి చాలా కారణాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితి చూస్తుంటే బిగ్ బాస్ ప్రోగ్రాం టైమింగ్ కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. దానికి కారణం ఐపీఎల్.

Video Advertisement

ఒక రికార్డెడ్ షో, ఒక లైవ్ షో లో ఏదో ఒకటి ఎంచుకోవాలి అంటే, కచ్చితంగా జరిగేది డైరెక్ట్ గా మనకు చూపించే లైవ్ షో నే ఎంచుకుంటాం. అది కూడా ఒక ప్రోగ్రాం కి, క్రికెట్ కి మధ్య ఛాయిస్ ఉంటే నిస్సందేహంగా మెజారిటీ జనాలు క్రికెట్ నే ఎంచుకుంటారు.ఈ ప్రోగ్రాం విషయంలో కూడా అలానే జరుగుతోంది. ఎక్కువ మంది బిగ్ బాస్ కంటే ఐపీఎల్ చూస్తున్నారు. దాంతో టిఆర్పి లో కూడా తేడా వచ్చింది. వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున జనరల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ జాబితాలో స్టార్ మా మొదటి స్థానంలో ఉంది అని చెప్పారు.

కానీ బ్రాడ్ కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (BARC) ఇచ్చిన విశ్లేషణ ప్రకారం జనరల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ లో మొదటి స్థానంలో స్టార్ స్పోర్ట్స్ వన్ హిందీ, రెండవ స్థానంలో స్టార్ ఉత్సవ్, మూడవ స్థానంలో స్టార్ ప్లస్, నాలుగవ స్థానంలో సన్ టివి ఉన్నాయి. ముందు స్థానంలో ఉంది అని చెప్పిన స్టార్ మా ఐదవ స్థానంలో ఉంది. ఏదేమైనా ఈ సారి మాత్రం గత సీజన్లకి వచ్చినంత రెస్పాన్స్ రావట్లేదు అనే చెప్పొచ్చు.


You may also like