చూస్తుండగానే బిగ్ బాస్ మొదలయ్యి రెండు నెలలు గడిచిపోయింది. ఇప్పుడు హౌస్ లో ఎనిమిది మంది కంటెస్టెంట్స్ మిగిలారు. ఎలిమినేషన్ లో కూడా ఎవరు ఊహించని విధంగా కొంత మంది స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వచ్చేస్తున్నారు. గత ఎలిమినేషన్ లో మెహబూబ్ ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అఖిల్, సోహెల్, లాస్య, మోనాల్, అభిజిత్, అరియానా, హారిక, అవినాష్.

ఎపిసోడ్ టీవీలో టెలికాస్ట్ అయ్యే ముందే ఆ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో అనే అప్డేట్స్ సోషల్ మీడియా ద్వారా వస్తూనే ఉంటాయి. అలాగే అసలు బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజేత ఎవరో, రన్నరప్ ఎవరో, టాప్ 5 లో ఎవరు ఉంటారో అనే విషయాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వైరల్ అవుతున్న వివరాల ప్రకారం టాప్ 5 లో ఉండే కంటెస్టెంట్స్ అభిజిత్, లాస్య, సోహెల్, అవినాష్, అఖిల్. టాప్ 2 లో అభిజిత్, లాస్య ఉంటారు అని, లాస్య రన్నరప్ అవ్వగా, సీజన్ విజేతగా అభిజిత్ నిలుస్తారు అనే వార్త ప్రచారం అవుతోంది. ఈ వార్తలో ఎంత నిజముందో తెలుసుకోవాలంటే గ్రాండ్ ఫినాలే వరకు ఆగాల్సిందే.

గత వారం వీకెండ్ ఎపిసోడ్ విషయానికి వస్తే, శనివారం దివాలి అవ్వడంతో ఎపిసోడ్ సరదాగా సాగింది. ఆదివారం ఎలిమినేషన్ లో భాగంగా మెహబూబ్ బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి రావడంతో ఎపిసోడ్ చాలా ఎమోషనల్ గా నడిచింది. ఇంక ఈ వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ జరగనుంది.

 


తెలుగు కంటెంట్ రైటర్స్ కి తెలుగుఅడ్డా ఆహ్వానం.! Mail us your resume and samples to: teluguaddahr@gmail.com