డాక్టర్ నిర్వాకం బయటపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్…ఎలా ఉండే ఫేస్ ఎలా మారిపోయిందో చూడండి.!

డాక్టర్ నిర్వాకం బయటపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్…ఎలా ఉండే ఫేస్ ఎలా మారిపోయిందో చూడండి.!

by Mohana Priya

Ads

తమిళ్ లో  నటిగా అలాగే బిగ్ బాస్ తమిళ్ కంటెస్టెంట్ గా ప్రేక్షకుల్లో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు రైజా విల్సన్. అయితే రైజా విల్సన్ ఏప్రిల్ 18వ తేదీన సోషల్ మీడియా ద్వారా చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం చర్చలో ఉంది. ఈ పోస్టులో రైజా విల్సన్ ఒక పిక్చర్ షేర్ చేశారు.

Video Advertisement

bigg boss tamil raiza wilson

అందులో తన కన్ను వాచి ఉంది. పోస్ట్ తో పాటు రైజా విల్సన్ ఒక మెసేజ్ నోట్ కూడా రాశారు. అందులో ఈ విధంగా పేర్కొన్నారు “నేను నిన్న డాక్టర్ భైరవి సెంథిల్ క్లినిక్ కి ఒక మామూలు ఫేషియల్ ట్రీట్మెంట్ కోసం వెళ్లాను.  ఆవిడ నన్ను నాకు అవసరం లేని ఒక ప్రొసీజర్ చేయించుకోమని బలవంతం చేశారు.

bigg boss tamil raiza wilson

దాని ఫలితం ఇలా ఉంది. ఆవిడ ఇవాళ నన్ను కలవడానికి కానీ నాతో మాట్లాడటానికి కానీ అంగీకరించలేదు. ఆవిడ ఊర్లో లేరు అని స్టాఫ్ చెప్పారు” అని పేర్కొన్నారు. అలాగే తన ఇంస్టాగ్రామ్ స్టోరీల్లో తను ఈ విషయం గురించి షేర్ చేసిన తర్వాత ఎంతో మంది ఇలాంటి సంఘటనలను చెప్పారు అని వారి స్క్రీన్ షాట్స్ కూడా పోస్ట్ చేశారు. అలాగే తన ఇన్ బాక్స్, ఈ డాక్టర్ ద్వారా ఇలాంటి సంఘటనలు ఎదుర్కొన్న వారి ఎన్నో మెసేజెస్ తో నిండిపోయింది అని అన్నారు.


End of Article

You may also like