ఎట్టకేలకు ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 మొదలయ్యింది. సాధారణంగా అయితే ఈ ప్రోగ్రాంలో సినీ రంగానికి చెందిన సెలబ్రిటీలని మాత్రమే ఎక్కువగా తీసుకుంటారు. కానీ ఈసారి మాత్రం సినిమా రంగానికి చెందిన ప్రముఖులతోపాటు సోషల్ మీడియాకు చెందిన ప్రముఖులను కూడా తీసుకున్నారు.

bigg boss telugu 5 lahari shari

అంతే కాకుండా సీరియల్ నటులు కూడా ఇందులో కంటెస్టెంట్స్ గా పాల్గొంటున్నారు. మనకి నచ్చిన సెలెబ్రిటీ నిజ జీవితంలో ఎలా ఉంటారో తెలుసుకోవాలనే ఆసక్తి మనలో చాలా మందికి ఉంటుంది. అందుకే ఈ ప్రోగ్రాంకి అంత క్రేజ్ ఉంది. ఈసారి బిగ్ బాస్ తెలుగు-5 కంటెస్టెంట్స్ గా హౌస్ లోకి అడుగు పెట్టిన వారిలో లహరి షారీ ఒకరు.

bigg boss telugu 5 lahari shari

lahari shari in malli raava

లహరి అర్జున్ రెడ్డి సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. ఆ తర్వాత మళ్లీ రావా సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించారు. తర్వాత జగపతి బాబు హీరోగా నటించిన పటేల్ సర్, అజ్ఞాతవాసి, పేపర్ బాయ్ సినిమాల్లో నటించారు. నితిన్ హీరోగా నటించిన శ్రీనివాస కళ్యాణం సినిమాలో నితిన్ ఫ్రెండ్ పాత్రలో నటించారు లహరి.bigg boss telugu 5 lahari shari

ఆ తర్వాత తిప్పరా మీసం, జాంబీ రెడ్డి సినిమాలతో పాటు గ్రామ అనే కన్నడ సినిమాలో కూడా నటించారు. లహరి నటించడం మాత్రమే కాకుండా షారీస్ హెయిర్ అండ్ బ్యూటీ స్టూడియో పేరుతో ఒక స్పా కూడా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం లహరి బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టారు. ఇంత వరకు జరిగిన ప్రతి టాస్క్ లో ఎంతో యాక్టివ్ గా పాల్గొన్నారు లహరి. అలాగే హౌస్ లో కూడా ప్రతి బాధ్యతని కరెక్ట్ గా నిర్వర్తిస్తున్నారు.