“మన అనుకున్న వాళ్ల తోనే కదా? ప్రేమ అయినా! కోపం అయినా!” అంటూ… బిగ్‌బాస్ ప్రియ ఎమోషనల్ పోస్ట్..!.!

“మన అనుకున్న వాళ్ల తోనే కదా? ప్రేమ అయినా! కోపం అయినా!” అంటూ… బిగ్‌బాస్ ప్రియ ఎమోషనల్ పోస్ట్..!.!

by Mohana Priya

Ads

బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయిన తర్వాత ప్రియ తన ఇంస్టాగ్రామ్ ద్వారా ఒక మెసేజ్ షేర్ చేశారు. అందులో ప్రియ ఈ విధంగా రాశారు. “డే1 : నన్ను నేను తెలుసుకోవడానికి వెళ్తున్నాను. డే 50 : మీ అందరి ప్రేమని తీసుకొని బయటికి వచ్చాను. ఈ జర్నీ నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఎంతోమంది అద్భుతమైన వ్యక్తులని కలిసాను. వాళ్ళందరూ నాకు కుటుంబంలా అయ్యారు. నాకు ఇంత మంచి జ్ఞాపకాలు ఇచ్చినందుకు స్టార్ మాకి, నాగార్జున గారికి చాలా థాంక్స్”.

Video Advertisement

bigg boss telugu 5 priya emotional note

“నా శ్రేయోభిలాషులకి, కుటుంబానికి, నన్ను ప్రేమించిన వారందరికీ చాలా థాంక్స్. మీ ప్రేమ చాలా స్వచ్ఛమైనది. మీ మెసేజెస్, సహకారం అన్నీ చూశాను. నన్ను మీ కుటుంబంలాగా అనుకొని చాలా చాలా కష్టపడ్డారు నన్ను సేవ్ చేయడానికి. నేను లోపల ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా, మీరు అందరూ బయట ఒక పిల్లర్ లాగా నా కోసం నిలబడ్డారు. ప్రతి కంటెస్టెంట్ తో ఏదో ఒక మంచి సందర్భం ఉంది. అందరూ ఒక సందర్భంలో నన్ను చాలా బాగా చూసుకున్నారు”.

why priya is highlighted in bigg boss telugu 5

“అందరూ చాలా కనెక్ట్ అయ్యారు. అయినా, “మన” అనుకున్న వాళ్లతోనే కదా? గొడవ అయినా, ప్రేమ అయినా, కోపం అయినా. ఫ్యాన్ పేజెస్ కి చాలా రుణపడి ఉన్నాను. మీ బిజీ జీవితంలో, మీరు నన్ను మీ మనిషి అని అనుకుని చాలా కష్టపడ్డారు. నాకు ఇంత ప్రేమ అందుకోవడం చాలా సంతోషంగా అనిపించింది. నేను మీ అందరినీ గెలుచుకున్నాను. చాలా హ్యాపీగా ఉన్నాను. మీ ప్రియ.” అని ఎమోషనల్ నోట్ రాసారు ప్రియ.

https://www.instagram.com/p/CVcYApsJdTZ/?utm_source=ig_web_copy_link


End of Article

You may also like