ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 మొదలయ్యింది. సాధారణంగా అయితే ఈ ప్రోగ్రాంలో సినీ రంగానికి చెందిన సెలబ్రిటీలని మాత్రమే ఎక్కువగా తీసుకుంటారు. కానీ ఈసారి మాత్రం సినిమా రంగానికి చెందిన ప్రముఖులతోపాటు సోషల్ మీడియాకు చెందిన ప్రముఖులను కూడా తీసుకున్నారు. మొదటి వీక్ నామినేషన్స్ లో భాగంగా సరయు హౌస్ లో నుండి బయటికి వెళ్లిపోయారు.

Netizens comments on Nagarjuna mistake during shanmukh entry in Bigg Boss

ఈసారి షో లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్న కంటెస్టెంట్ ఎవరు అని అందరిలో సందేహం నెలకొంది. ఈ సీజన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్న సెలబ్రిటీ తనే అంటూ ఒకరి పేరు మాత్రం ప్రచారంలో ఉంది. తానెవరో కాదు యాంకర్, నటి వర్షిణి. అసలు వర్షిణి బిగ్ బాస్ లోకి మామూలు కంటెస్టెంట్ గానే అడుగు పెట్టాల్సి ఉంది. కానీ తన షూటింగ్స్ వల్ల వెళ్లలేకపోయారు.

15 anchor varshini

అందులోనూ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న శాకుంతలం సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించారు వర్షిణి. ఇప్పుడు ఈ  సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. దాంతో ఇటు వర్షిణి కూడా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు అనే వార్త గట్టిగా వినిపిస్తోంది. ఈ వారం ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నారట. మరి ఆ సెలబ్రిటీ ఎవరో తెలియాలి అంటే ఈ వారం బిగ్ బాస్ ఫాలో అవ్వాల్సిందే.