“బొమ్మరిల్లు” సినిమాలో లాగా బస్‌లో నుంచి దూకేసింది… యాక్సిడెంట్‌లో గీతూ కోమాలోకి?

ఈ సారి బిగ్ బాస్ కి వచ్చిన కంటెస్టెంట్స్ లో గీతూ కూడా ఒకరు. గీతూ ప్రేక్షకులని బాగానే ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. పైగా తను ఆట కోసమే వచ్చానని బిగ్ బాస్ లో చెప్పేశారు. గీతూకి వికాస్ అనే వ్యక్తితో వివాహం అయింది.

వికాస్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ పెళ్లికి ముందు వీళ్ళు ఇద్దరూ మంచి స్నేహితులు. ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే ఒక్కోసారి గీతూని చూస్తే చాలా మందికి చిరాకు వస్తుంది.

అయితే గీతుకి మాత్రం మేజర్ యాక్సిడెంట్ అయ్యిందట. ఈ విషయాన్ని నాగార్జున ముందు కూడా ఈమె చెప్పింది. మేజర్ యాక్సిడెంట్ అయిందని కోమాలోకి వెళ్లిపోయిందని నాగార్జునతో చెప్పింది ఈమె. అయితే నిజంగా గీతూ కి యాక్సిడెంట్ అయిందా..? అసలు ఇంతకీ ఏమైంది.. అనే విషయాలని గీత భర్త వికాస్ చెప్పారు. ఒక ఇంటర్వ్యూలో గీతూ భర్త వికాస ఇలా చెప్పారు.

2014లో గీతూకి మేజర్ యాక్సిడెంట్ అయింది. ఆరోజు నేను ఎప్పటికీ మర్చిపోలేను అని అన్నారు. అయితే వీళ్ళిద్దరూ బెంగుళూరులోని ఇస్కాన్ టెంపుల్ కి వెళ్దామని బస్సు ఎక్కారట. అరకిలో మీటర్ ప్రయాణం చేస్తే ఇంక టెంపుల్ వస్తుంది. అందుకని ఫుట్‌బోర్డ్‌ దగ్గర నిలబడ్డారట.

ఇంతలో ఈమెకి ఏమైందో తెలియదు కానీ రన్నింగ్ బస్ నుంచి దూకింది. సడన్ గా రన్నింగ్ బస్సు నుండి దిగడంతో కిందపడిపోయింది. బలంగా గాయం అయ్యి ఓవర్ బ్లీడింగ్ అయిందట. ఆ సమయంలో బ్రతికి ఉంటుందా మరణిస్తుంద అనేది నాకు తెలియలేదని వికాస్ అన్నారు. ఆమె అలా రోడ్డు మీద పడిపోవడంతో జనం వచ్చేసారని సహాయం చేయడానికి ఒక వ్యక్తి వచ్చి కారులో తీసుకు వెళ్లారని గీతూ భర్త వికాస్ చెప్పారు.

కానీ ఆమె బతికి ఉంటుందా లేదా అనేది అప్పుడు తనకి కూడా తెలియదు అన్నారు. డాక్టర్లు వచ్చి కంగారు పడక్కర్లేదు కోమాలోకి వెళ్ళింది అని చెప్పారు. అయితే గీతూ కోమా నుంచి వచ్చిన తర్వాత చాలా విషయాలు మర్చిపోయిందట దానివల్ల నష్టం ఉంది లాభం ఉంది అని చెప్పారు వికాస్. కొన్ని సార్లు ముఖ్యమైన విషయాలను కూడా మర్చి పోతుందట.