Ads
ఎన్నో సినిమాల్లో హీరోగా, సహాయ పాత్రల్లో నటించిన నటుడు శివాజీ. శివాజీ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా చాలా ఫేమస్ అయ్యారు. ఇప్పుడు శివాజీ నటించిన కొత్త వెబ్ సిరీస్ 90 స్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈటీవీ యాప్ లో ఇది రిలీజ్ అయ్యింది. ఈ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
- వెబ్ సిరీస్ : 90 స్ (నైంటీస్ )
- నటీనటులు : శివాజీ, వాసుకి ఆనంద్, మౌళి తనూజ్ ప్రశాంత్, రోహన్ రాయ్, వాసంతిక, స్నేహాల్ కామత్.
- నిర్మాత : నవీన్ మేడారం, రాజశేఖర్ మేడారం
- దర్శకత్వం : ఆదిత్య హాసన్
- సంగీతం : సురేష్ బొబ్బిలి
- విడుదల తేదీ : జనవరి 5, 2024 (ఈటీవీ విన్)
స్టోరీ :
చంద్రశేఖర్ (శివాజీ) ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన వాడు. ఆయన భార్య రాణి (వాసుకి ఆనంద్), వారి పిల్లలు రఘు (మౌళి తనూజ్ ప్రశాంత్), దివ్య (వాసంతిక), ఆదిత్య (రోహన్ రాయ్). చంద్రశేఖర్ గవర్నమెంట్ స్కూల్లో లెక్కల మాస్టారుగా చేస్తూ ఉంటాడు. కానీ పిల్లల్ని మాత్రం ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తాడు. ఆదిత్య అంత బాగా చదవడు. రఘు, దివ్య మాత్రం బాగా చదువుతారు. అయితే పదో తరగతిలో రఘుకి జిల్లా ఫస్ట్ ర్యాంకు వస్తుంది అనుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? రఘు క్లాస్‌మేట్ సుచిత్ర (స్నేహాల్ కామత్) రఘుకి ఫ్రెండ్ అయ్యిందా? ఆదిత్య చదువులో మెరుగుపడ్డాడా? చంద్రశేఖర్ ఏం చేశాడు? ఇవన్నీ తెలియాలి అంటే మీరు ఈ సిరీస్ చూడాల్సిందే.
రివ్యూ :
సిరీస్ మొత్తం కూడా పేరుకు తగ్గట్టే 90లో కాలంలో ఉన్నట్టే ఉంటుంది. ఆ కాలంలో వచ్చిన సినిమా రిఫరెన్సెస్, వాళ్ళు వేసుకునే బట్టలు, చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు అవన్నీ కూడా అప్పటికి తగ్గట్టే ఉన్నాయి. సిరీస్ లో నటీనటులు అందరూ కూడా చాలా బాగా నటించారు. కథపరంగా చాలా సింపుల్ గా ఉంటుంది. కానీ దాన్ని ఎక్కడా బోర్ కొట్టకుండా చూపించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఒక మధ్యతరగతి కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఉంటాయో ఈ సిరీస్ లో చూపించారు.
చాలా మంది తప్పకుండా చాలా సీన్స్ కి కనెక్ట్ అవుతారు. కేవలం కుటుంబం గురించి మాత్రమే కాదు, టీనేజ్ లో విద్యార్థులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు? వాళ్ల ఆలోచన తీరు ఎలా మారుతుంది అనేది కూడా ఇందులో చాలా బాగా చూపించారు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అందరూ చాలా బాగా చేశారు. ముఖ్యంగా చాలా సహజంగా చేశారు. చాలా రోజుల తర్వాత శివాజీని తెరపై చూడడం బాగా అనిపిస్తుంది. మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళ పాత్రలకు తగ్గట్టు చేశారు. పాటలు కూడా బాగున్నాయి. కానీ ఫన్ మాత్రం ఇంకా కొంచెం ఉంటే బాగుండేది. కామెడీ సీన్స్ ఇంకా కొంచెం బాగా రాసుకొని ఉంటే తెరపై బాగా కనిపించేది.
ప్లస్ పాయింట్స్ :
- 90ల పరిస్థితులు చూపించిన విధానం
- నటీనటుల పర్ఫార్మెన్స్
- సహజంగా ఉండే డైలాగ్స్
- కొన్ని ఎమోషనల్ సీన్స్
మైనస్ పాయింట్స్:
- తెలిసిపోయే కథనం
- స్లో గా ఉండే కొన్ని సీన్స్
రేటింగ్ :
3.25/5
ట్యాగ్ లైన్ :
సిరీస్ మొత్తం కూడా చాలా నేచురల్ గా ఉంటుంది. కథనం తెలిసిపోయేలాగా ఉన్నా కూడా ఎక్కడా బోర్ కొట్టించకుండా ఉంటుంది. చాలా చోట్ల ప్రేక్షకులు కనెక్ట్ కూడా అవుతారు. ఒక మంచి ఫీల్ గుడ్ వెబ్ సిరీస్ గా 90 స్ సిరీస్ నిలుస్తుంది.
watch trailer :
ALSO READ : హీరో సిద్ధార్థ్ భార్యను ఎప్పుడైనా చూసారా..? ఆమె గురించి మీకు ఈ విషయం తెలుసా..?
End of Article