సినిమాల్లో హీరో గా ఛాన్స్ కొట్టేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్..!

సినిమాల్లో హీరో గా ఛాన్స్ కొట్టేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్..!

by Mounika Singaluri

బిగ్ బాస్ సీజన్ 7 షో నిన్న‌టితో పూర్తయ్యింది. తెలుగులో టాప్ రియాలిటీ షో గా పేరు తెచ్చుకుంది బిగ్ బాస్.ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ సెల‌బ్రిటీల సంద‌డితో మారుమోగింది. రైతుబిడ్డ‌గా అందరి మ‌నుసుల్లో స్థానాన్ని సంపాదించుకున్న ప‌ల్ల‌వి ప్ర‌శాంత్ విన్న‌ర్‌గా నిలిచి ట్రోపీని ద‌క్కించుకున్నాడు.

Video Advertisement

ర‌న్న‌ర్‌గా టివీ సీరియ‌ల్ న‌టుడు అమ‌ర్‌దీప్ నిలిచాడు. ఈ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌లో కంటెస్టెంట్లు డ్యాన్సుల‌తో అద‌ర‌గొట్టేసారు. హౌస్ లో ఉన్న ఆరుగురు ఫైనలిస్ట్స్ కూడా త‌మ ప్ర‌ద‌ర్శ‌న‌తో ఇరగదీశారు.

ఇదిలా ఉంటే హౌస్ నుంచి బ‌య‌టికి వెళ్లిన కంటెస్టెంట్ల‌కు సినిమా ఆఫ‌ర్లు బాగా వ‌స్తోన్న‌ట్లు తెలుస్తోంది.ఇప్పటి వరకు అన్ని సీజన్ లలో కంటిస్టంట్ లకి ఇప్పటికే మంచి మంచి ఆఫర్ లు వచ్చి సెటిల్ అయ్యారు.హౌస్‌లో డాక్ట‌ర్ బాబుగా ప‌రిచ‌య‌మైన గౌత‌మ్ మూడు సినిమా ఆఫ‌ర్లు అందుకున్న‌ట్లు స‌మాచారం. గ్రాండ్ ఫినాలేకు వ‌చ్చిన గౌత‌మ్‌ తో కొంద‌రు మీడియా వారు మాట్లాడ‌గా.. నేను చాలా సంతోషంగా ఉన్నాను. మూడు సినిమాల‌కు హీరోగా సైన్ చేశాను. మా అమ్మ‌కు ముందే రిటైర్మెంట్ ఇప్పిస్తున్నాను. రిటైర్మెంట్ అంటే సెటిల్ కాలేద‌నే భ‌యం ఉండేది. ఇప్పుడు అది లేదు అంటూ ఎంతో సంతోషంగా చెప్పుకొచ్చాడు. సినిమాల్లోకి రావాల‌నే త‌న కోరిక బిగ్‌బాస్‌తో నేర‌వేరింద‌ని ఆనందం వ్య‌క్తం చేశాడు.


You may also like

Leave a Comment