మిర్చి సినిమాలో “బ్యాక్‌గ్రౌండ్‌ డాన్సర్”గా చేసిన… ఈ “బిగ్‌బాస్ తెలుగు” కంటెస్టెంట్‌ని గుర్తుపట్టారా..?

మిర్చి సినిమాలో “బ్యాక్‌గ్రౌండ్‌ డాన్సర్”గా చేసిన… ఈ “బిగ్‌బాస్ తెలుగు” కంటెస్టెంట్‌ని గుర్తుపట్టారా..?

by Mohana Priya

Ads

సినిమాల్లోకి వచ్చే ముందు ఆ రంగానికి చెందిన వాళ్లు అందరూ చాలా కష్టాలు పడతారు. చిన్న చిన్న పాత్రల్లో నటించి లేదా కెమెరా వెనకాల పని చేసి ఇప్పుడు పెద్ద స్థాయికి ఎదిగిన నటులు ఎంతోమంది ఉన్నారు. ఇదేవిధంగా, ఇటీవల కాలంలో పేరు తెచ్చుకుంటున్న కొంతమంది నటులు కూడా కూడా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించారు.

Video Advertisement

వివరాల్లోకి వెళితే, కొరటాల శివ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన సినిమా మిర్చి. ఈ సినిమా దర్శకుడిగా కొరటాల శివకి మొదటి సినిమా. కానీ ఎన్నో సినిమాల అనుభవం ఉన్నట్టుగా ఈ సినిమా రూపొందించారు కొరటాల శివ. ఇందులో ప్రభాస్ పాత్ర తీరు కూడా కొత్తగా ఉంటుంది. చాలా స్టైలిష్ గా ఉంటారు ప్రభాస్.

bigg boss telugu contestant as a background dancer in mirchi

అప్పట్లో ప్రభాస్ లుక్ కి చాలా మంచి క్రేజ్ వచ్చింది. ఈ సినిమాకి పాటలు కూడా ఒక పెద్ద హైలైట్ గా నిలిచాయి. దేవి శ్రీ ప్రసాద్ మిర్చి సినిమాకి సంగీత దర్శకత్వం వహించారు. తర్వాత ఈ సినిమా చాలా భాషల్లోకి కూడా రీమేక్ అయ్యింది. అయితే ఇందులో ఒక పాటలో బిగ్ బాస్ తెలుగు కంటెస్టెంట్ బ్యాక్ గ్రౌండ్ ఆర్టిస్ట్ గా కనిపిస్తారు. డార్లింగే పాటలో అనుష్క వెనకాల ఈ కంటెస్టెంట్ ఉంటారు.

bigg boss telugu contestant as a background dancer in mirchi

తను ఎవరో కాదు బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 లో కంటెస్టెంట్ గా పాల్గొన్న భాను శ్రీ. భాను శ్రీ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తల్లో చాలా చిన్న చిన్న పాత్రల్లో నటించారు. బాహుబలి సినిమాలో తమన్నాకి డూప్ గా కూడా నటించారు. తర్వాత కుమారి 21ఎఫ్, మహానుభావుడు సినిమాల్లో కూడా నటించారు భాను శ్రీ. ఇటీవల భాను శ్రీ నల్లమల అనే సినిమాలో హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాలో అమిత్ తివారి హీరోగా నటించారు.


End of Article

You may also like