పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. అర్ఖా పుట్టిందంటూ పోస్ట్ పెట్టిన అర్జున్!

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. అర్ఖా పుట్టిందంటూ పోస్ట్ పెట్టిన అర్జున్!

by Mounika Singaluri

Ads

బిగ్ బాస్ సీజన్ సెవెన్ కంటెస్టెంట్ అర్జున్ అంబటి ఇంట్లో సంబరాలు సంబరాలు అంబరాన్నంటాయి. పండంటి బిడ్డ పుట్టిందంటూ సోషల్ మీడియాలో అంబటి అర్జున్ పోస్ట్ చేయడంతో సహచరులు సైతం తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ అభినందనలు పంపిస్తున్నారు. బిగ్బాస్ షోలో ఉండగానే ప్రెగ్నెంట్ అయిన భార్యని ఇంట్లో వదిలేసి వచ్చేసాను అని చాలా ఎమోషనల్ అయ్యేవాడు.

Video Advertisement

అది చూసి బిగ్ బాస్ కూడా చివరికి అర్జున్ భార్య సురేఖ సీమంతాన్ని జరిపించేసింది. బిగ్ బాస్ ఇంట్లో ఉన్నప్పుడే కొడుకు పుట్టినా కూతురు పుట్టినా అర్ఖా అనే పేరు పెట్టుకుంటాను అని చెప్తూనే ఉన్నాడు అర్జున్. అతనికి ఆడపిల్లలంటే ఎంతో ఇష్టమని కూతురు పుడితే బాగుంటుంది అని ఆశపడ్డాడు. అయితే అనుకున్నట్లుగానే పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చిన అర్జున్ వెంటనే ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తన సంతోషాన్ని పంచుకున్నాడు.

నిజానికి గర్భంతో ఉన్న తన భార్యను వదిలేసి బిగ్ బాస్ హౌస్ కి రావడం తనకి ఇష్టం లేదని ఏ భార్యకైనా కూడా ఇలాంటి సందర్భంలో భర్త పక్కనే ఉండాలని కోరుకుంటుంది కానీ తను మాత్రం బిగ్ బాస్ షో కి వచ్చానని అలా రావటం తనకు చాలా బాధగా అనిపించిందని అర్జున్ స్టేజి మీద ఎన్నోసార్లు చెప్పాడు. అనుకున్నట్లుగానే ఆడబిడ్డ పుట్టడంతో అర్జున్ ఆనందంతో తేలిపోతున్నాడు.

బుల్లితెర సెలబ్రిటీలు, బిగ్ బాస్ కంటెస్టెంట్లు, అభిమానులు సైతం అర్జున్ కి కంగ్రాట్స్ చెప్తున్నారు. ప్రస్తుతం అర్జున్ పలు టీవీ షో లతో బిజీగా ఉన్నాడు. పూర్ణ తో సుందరి అనే సినిమాలో హీరోగా నటించిన అర్జున్ ఇప్పుడు మరో చిత్రం ద్వారా హీరోగా మన ముందుకి రాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఏది ఏమైనాప్పటికీ మనం అనుకున్నది జరిగితే ఆ ఆనందమే వేరు ఇప్పుడు అలాంటి ఆనందాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు అర్జున్.


End of Article

You may also like