వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ పరిస్థితి పరమ వరస్ట్‌గా మారింది. ఎంటర్టైన్మెంట్‌కి అడ్డా ఫిక్స్ అంటూ సీజన్ 6తో హంగామా చేసిన హోస్ట్ నాగార్జున కెరియర్‌లోనే వరస్ట్ రికార్డ్స్ నమోయ్యాయన్న విషయం తెల్సిందే.

Video Advertisement

తెలుగు రియాలిటీ షో బిగ్ బాగ్ సీజ‌న్ 6 కింగ్ నాగార్జున వ్యాఖ్యాత‌గా సెప్టెంబ‌ర్ 4న గ్రాండ్‌గా ప్రారంభమైంది. వరుసగా నాగార్జున నాలుగోసారి హోస్ట్ చేసిన సీజన్ 6కి తెలుగు బిగ్ బాస్ హిస్టరీలో అతి తక్కువ టీఆర్పీ రేటింగ్‌ కి పరిమితం అయ్యింది.

సెప్టెంబర్ 4 ఆదివారం నాటి బిగ్ బాస్ సీజన్ 6 లాంఛింగ్ ఎపిసోడ్ కేవ‌లం కేవలం 8.86 టీఆర్‌పీ రేటింగ్ మాత్ర‌మే సాధించింది. గత ఆరు సీజ‌న్స్‌లో లాంఛింగ్ ఎపిసోడ్‌కు వ‌చ్చిన లోయెస్ట్ రేటింగ్ ఇదే అన్న విషయం తెల్సిందే. ఇదిలా ఉంటే సోమవారం ఎపిసోడ్ లో నామినేషన్స్ ప్రక్రియ పూర్తయింది. ఎప్పుడు నామినేషన్స్ ని కొత్తగా చేస్తుంటారు. ఇప్పుడు కూడా అలా కొత్తగా నామినేషన్స్ చేసారు.

ఈసారి అయితే టమాటలను తీసుకుని కొట్టి కంటెస్టెంట్స్ ఈసారి నామినేషన్ ప్రక్రియను పూర్తి చేసారు. ఇనయా సుల్తానా ని ఈసారి ఎక్కువ మంది నామినేట్ చేసారు. సుదీప, ఆరోహి, గీతూ రాయల్, శ్రీహన్, రాజ శేఖర్, సూర్య , రేవంత్ ఈసారి నామినేషన్స్ లో వున్నారు. వీరిలో ఒకరు ఇంటి నుండి బయటకి వచ్చేస్తారు. అయితే ఇనయా సుల్తానా మాత్రం స్పెషల్ ఎట్రాక్షన్ అయ్యిపోయింది.

ఆమె మాటలు, ప్రవర్తన చర్చనీయాంశంగా మారింది. ఈసారి నామినేషన్స్ లో వున్నవాళ్ళల్లో ఆమె బలహీనంగా కనపడుతోంది. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మాత్రం సపోర్ట్ ఇస్తున్నారు. ఈమె తరవాత వీక్ గా వుండే వారి లో కీర్తి, అర్జున్ వున్నారు. పైగా ఈసారి నామినేషన్స్ రసవత్తరంగా సాగుతున్నాయి. ఇంకా సమయం వుంది కనుక ఆ ఆట బట్టి ఎలిమినేషన్ ఉంటుంది. మరేమవుతుందో చూడాలి. ఇనాయ వచ్చేస్తుందా ఈ వారం లేదా మరెవరైనా వచ్చేస్తారా అనేది.