HIT-2: ఆ తప్పు వల్లే హిట్-2 మూవీకి బ్లాక్ బస్టర్ మిస్ అయ్యిందా?

HIT-2: ఆ తప్పు వల్లే హిట్-2 మూవీకి బ్లాక్ బస్టర్ మిస్ అయ్యిందా?

by kavitha

Ads

HIT-2: అడివి శేష్ తాజా క్రైమ్ థ్రిల్లర్ చిత్రం హిట్ 2. శైలేష్ కొలను రచించి దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదలైంది. ఈ చిత్రం విశ్వక్ సేన్ నటించిన విజయవంతమైన చిత్రం HIT కి సీక్వెల్. ఈ చిత్రానికి అభిమానులు మరియు విమర్శకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

Video Advertisement

మొదటి వారంలోనే ఈ మూవీ చాలా ఏరియాలలో బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కాగా, ఇక్కడ హిట్2 ప్రొడ్యూసర్స్ చేసిన ఒక తప్పు గురించి నెట్టింట్లో చర్చ జరుగుతొంది. ఇంతకి ఆ తప్పు ఏంటంటే హిట్2 లాంటి క్రైమ్ థ్రిల్లర్ సినిమాకి ట్విస్ట్ అనేది హైలెట్ అనే వేరే చెప్పనవసరం లేదు. అయితే మేకర్స్ ట్విస్ట్ ను బహిర్గతం చేయవద్దని పదే పదే అభ్యర్ధించడంతో యూట్యూబ్ ఛానెళ్లు కొన్ని ఆ ట్విస్ట్ ను బహిర్గతం చేయడంతో హిట్2 మూవీ పై ఆడియెన్స్ లో ఇంట్రెస్ట్ ని చంపేయడం ప్రస్తుతం చర్చకు కారణం అయ్యింది.hit-2-adivi-sesh-telugu adda మేకర్స్ కనుక ట్విస్ట్ గురించి మాట్లాడకుండా ఉండి ఉంటే మూవీకి ప్లస్ గా మారేదని నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమా సంజన అనే బాధితురాలిని దారుణంగా హత్య చేసిన కేసును ఇన్వెస్ట్ గేట్ చేయడానికి వచ్చిన ఎస్పీ రేంజ్ పోలీసు కృష్ణ దేవ్ (అడివి శేష్) చుట్టూ సినిమా తిరుగుతుంది. సంజనలాగే అనేక మంది మహిళలకు జరిగిందని అతను తరువాత తెలుసుకుంటాడు. కృష్ణ దేవ్ కిల్లర్‌ని ఎలా పట్టుకుంటాడు అనేది సినిమా కథ.హిట్: ది సెకండ్ కేస్ థియేట్రికల్ రిలీజ్ మొదటి రోజు, ఇండియా వైడ్ గా అన్ని కేంద్రాల నుండి దాదాపు రూ. 6 కోట్లు రాబట్టింది. థియేటర్ల ఆక్యుపెన్సీ రేషియో కూడా డీసెంట్‌గా నమోదైంది మరియు రోజు చివరి నాటికి మెరుగుపడింది. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిచింది. సుహాస్, రావు రమేష్, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణ మురళి, కోమలి ప్రసాద్, మాగంటి శ్రీనాథ్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు పోషించారు. దర్శకుడు శైలేష్ కొలను ప్లాన్ చేసిన హిట్ వర్స్ లో HIT 2 రెండవ సినిమా.


End of Article

You may also like