డిగ్రీ చేసింది…ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రాలేదని కాలేజీ ముందు ఈ అమ్మాయి ఏం చేసిందో తెలుసా.?

డిగ్రీ చేసింది…ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రాలేదని కాలేజీ ముందు ఈ అమ్మాయి ఏం చేసిందో తెలుసా.?

by Anudeep

Ads

బీహార్ ఎకనామిక్స్ గ్రాడ్యుయేట్ అయిన ఈ అమ్మాయి పాట్నాలోని ఓ కాలేజీ వద్ద టీ స్టాల్ ఓపెన్ చేసింది. ప్రధాని మోడీ పిలుపునిచ్చిన ఆత్మ నిర్భర్ భారత్ ను ఆదర్శంగా తీసుకోవాలంటూ చెబుతోంది. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు.. ఈ అమ్మాయి స్టోరీ ఏంటి అనేది ఈ ఆర్టికల్ లో చూద్దాం.

Video Advertisement

ఈ కష్ట సమయాల్లో ఉద్యోగం దొరకడం చాలా కష్టం. ప్రఖ్యాత విద్యాసంస్థల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినప్పటికీ, మంచి ఉద్యోగం కోసం విద్యార్థులు తిరుగుతూనే ఉంటున్నారు. దేశంలో నిరుద్యోగుల సంఖ్య కొంచం ఎక్కువగానే ఉంది.

chaiwaali 1

వారిలో ఒకరు ప్రియాంక గుప్తా . ప్రియాంక వయసు 24 సంవత్సరాలు. 24 ఏళ్ల అమ్మాయి, ఆమె 2019లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసారు. గవర్నమెంట్ జాబ్ సాధించాలి అనేది ఆమె లక్ష్యం. అందుకోసం ఆమె రెండేళ్ల పాటు కఠోర సాధన చేసారు. అయినప్పటికీ ఆమెకు జాబ్ రాలేదు. అయినా ఆమె నిరుత్సాహ పడలేదు. తన కుటుంబ సభ్యులకు తాను భారం కాకూడదు అనుకుంది. బీహార్‌లోని పాట్నా మహిళా కళాశాల వెలుపల తన స్వంత టీ స్టాల్‌ను ప్రారంభించింది.

chaiwaali 2

బీహార్‌లోని పూర్నియా జిల్లాకు చెందిన గుప్తా రెండేళ్లుగా కష్టపడి బ్యాంకు పోటీ పరీక్షల్లో విజయం సాధించాలనుకుంది. కానీ, అందులో ఉత్తీర్ణత సాధించలేకపోయింది. అయినా నిరుత్సాహ పడకుండా తన గమ్యాన్ని మార్చుకుంది. ఆమె మహాత్మా గాంధీ కాశీ విద్యాపీఠ్, వారణాసిలో ఎకనామిక్స్ డిగ్రీని పొందారు. ఈ ఏడాది ఏప్రిల్ 11న ఆమె తన టీ స్టాల్‌ను ప్రారంభించారు. “”నేను 2019లో UG చేసాను, కానీ గత 2 సంవత్సరాలలో ఉద్యోగం సంపాదించుకోలేకపోయాను.. నేను ప్రఫుల్ బిల్లోర్‌ను స్ఫూర్తిగా ఎంచుకున్నాను.. చాలా మంది చాయ్‌వాలాలు ఉన్నారు, చాయ్ వాలీ ఎందుకు ఉండకూడదు?” అన్న ఉద్దేశ్యంతోనే చాయ్ స్టాల్ ను ప్రారంభించాను.

chaiwaali 3

చాయ్ వాలీ పేరుతోనే దుకాణాన్ని తెరిచింది. పాన్ టీ, చాక్లెట్ టీ తో సహా పలు రకాల వైవిధ్యమైన టీ లను ఆమె అందిస్తుంది. అంతే కాదు మోడీ పిలుపునిచ్చిన ఆత్మ నిర్భర్ భారత్ ను ఆమె స్ఫూర్తిగా తీసుకుంది. ఆమె దుకాణం వెలుపల ఒక బోర్డు ఉంటుంది. ” ఆత్మ నిర్భర్ భారత్ వైపు చొరవగా అడుగు వేయండి.. ఎవరో ఎదో అనుకుంటారని వెనకడుగు వేయద్దు.. ఇప్పుడే మీరు అనుకున్నది చేయండి..” అంటూ సందేశాన్ని రాసి పెట్టింది.


End of Article

You may also like