Home Politics BJP MLA VENKATA RAMANA REDDY: కెసిఆర్, రేవంత్ రెడ్డి లను ఓడించిన ఈ బీజేపీ ఎమ్మెల్యే కార్ నెంబర్ ప్లేట్ గమనించారా.?

BJP MLA VENKATA RAMANA REDDY: కెసిఆర్, రేవంత్ రెడ్డి లను ఓడించిన ఈ బీజేపీ ఎమ్మెల్యే కార్ నెంబర్ ప్లేట్ గమనించారా.?

by Sainath Gopi

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం నుండి బిజెపి ఎమ్మెల్యేగా కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఘన విజయం సాధించారు. ఇది మామూలు విజయం కూడా కాదు ఎందుకంటే ఇద్దరు సీఎంలను ఓడించిన ఘనత కాటిపల్లి వెంకటరమణారెడ్డికి దక్కింది. ఈ నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పోటీ చేశారు. అయితే ఇద్దరు ముఖ్య మంత్రి అభ్యర్థులు పోటీ చేయడంతో ఈ నియోజకవర్గంపై అందరి దృష్టిపడింది. ఇక్కడ బిజెపి తమ అభ్యర్థిగా కాటిపల్లి వెంకటరమణారెడ్డిని నిలబెట్టింది.

ఎవరు కూడా కెసిఆర్, రేవంత్ రెడ్డిని దాటుకుని కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఎమ్మెల్యే అవుతాడు అని అనుకోలేదు. అయితే ఎవరూ ఊహించని విధంగా కాటిపల్లి సంచలన విజయం సాధించారు. స్థానికుడు అవ్వడం అలాగే నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను ప్రత్యేక మేనిఫెస్టో రూపొందించి 100 కోట్లు ఖర్చు పెడతానని ప్రకటించడం బాగా కలిసి వచ్చింది.

అయితే ఇప్పుడు కాటిపల్లి మరో విషయంలో హైలైట్ అవుతున్నారు. తన కారు నెంబర్ ప్లేట్ ద్వారా ప్రధాని నరేంద్ర మోడీపై అభిమానాన్ని చాటుకున్నారు. ఎవరైనా కారు మీద గాని నెంబర్ ప్లేట్ల మీద గాని పేర్లు రాయిస్తుంటారు. కానీ కాటిపల్లి మోడీ పేరు వచ్చేలా ఏకంగా నెంబర్ నే సెలెక్ట్ చేసుకున్నారు. ఎన్నికల్లో ఆయన విజయం సాధించిన తర్వాత తన కారు నెంబర్ ప్లేట్ కూడా వైరల్ అయింది.

4749 నెంబర్ ను హిందీలో మోడీ అని వచ్చేలా డిజైన్ చేశారు. ఈ నెంబర్ కోసం తానేమి ప్రత్యేకంగా ఖర్చు పెట్టలేదని నెంబర్ సిరీస్ వచ్చేంతవరకు ఎదురుచూసినట్లు చెప్పుకొచ్చారు. అయితే ఇప్పటినుండి ఈ నెంబర్ కి బాగా డిమాండ్ పెరిగింది. ఈ నెంబర్ ను చూసిన మోడీ అభిమానులు దీని దక్కించుకోవడం కోసం పోటీ పడుతున్నారు.

https://www.instagram.com/p/C0jCJG_v93_/

You may also like